బాహుబలి రైటర్ రేంజేంటి.. ఈ సినిమా ఏంటి?

 బాహుబలి రైటర్ రేంజేంటి.. ఈ సినిమా ఏంటి?

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగిపోయింది. టాలీవుడ్లోనే కాదు.. వివిధ ఇండస్ట్రీల్లో ఆయన మోస్ట్ వాంటెడ్ రైటర్ అయ్యారు. హిందీలో భజరంగి భాయిజాన్, మణికర్ణిక.. కన్నడలో ‘జాగ్వార్’.. తమిళంలో ‘మెర్శల్’ లాంటి భారీ చిత్రాలకు ఆయన రచన అందించారు.

ఇప్పుడున్న స్థితిలో ఆయన చిన్నా చితకా సినిమాలు చేసే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అసలు చెప్పాలంటే రచయితగా మొదట్నుంచి విజయేంద్ర భారీ చిత్రాలే చేశారు. రాజమౌళి దర్శకుడు కాకముందే ‘బొబ్బిలి సింహం’, ‘సమరసింహారెడ్డి’ లాంటి చిత్రాలకు కథ అందించారు. ఇక జక్కన్న నిలదొక్కుకున్నాక విజయేంద్ర ప్రసాద్ ప్రయాణం ఎలాంటి మలుపు తీసుకుందో తెలిసిందే.

ఐతే ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉన్న విజయేంద్ర ప్రసాద్.. ఓ చిన్న చిత్రానికి కథ అందించడం ఆశ్చర్యం కలుగుతోంది. ఆ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది కమెడియన్ టర్న్డ్ హీరో సప్తగిరి కావడం విశేషం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ఎల్బీ’, ‘వజ్రకవచధర గోవిందా’ సినిమాల్లో సప్తగిరి హీరోగా నటించాడు. తొలి సినిమా ఓ మోస్తరుగా ఆడినా.. మిగతావి తేలిపోయాయి. అందులోనూ లేటెస్ట్ మూవీ దారుణ ఫలితాన్నందుకుంది. దీంతో హీరోగా వేషాలు మానేసి తిరిగి కమెడియన్‌గా ట్రై చేస్తే బెటర్ అంటూ సప్తగిరి మీద సెటైర్లు పడుతున్నాయి. కానీ అతను ఏకంగా విజయేంద్ర కథతో హీరోగా తన నాలుగో చిత్రం చేయనుండటం విశేషం. ఈ చిత్రానికి విజయేంద్ర సమర్పకుడిగా కూడా వ్యవహరించనున్నాడట.

నందమూరి బాలకృష్ణతో ‘విజయేంద్ర వర్మ’ అనే ఆల్ టైం డిజాస్టర్ తీసిన స్వర్ణ సుబ్బారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. తొలి సినిమాతో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్న సుబ్బారావు.. ఆ తర్వాత హర్షవర్ధన్‌గా పేరు మార్చుకుని కళ్యాణ్ రామ్‌తో ‘హరే రామ్’ లాంటి మంచి థ్రిల్లర్ మూవీ తీశాడు. అది అంతగా ఆడుకున్నా దర్శకుడికి కాస్త పేరు తెచ్చింది. కానీ ఈ డైరెక్టర్ మరో అవకాశం అందుకోవడానికి ఇంత కాలం పట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English