సూపర్ స్టార్‌కు ‘ఫేక్’ మరకలు

సూపర్ స్టార్‌కు ‘ఫేక్’ మరకలు

సూపర్ స్టార్ రజనీకాంత్ బయట కనిపించే అవతారానికి.. తెరమీద కనిపించేే అవతారానికి అసలు పోలికే ఉండదు. రజనీకి మేకప్ ఎవరు చేస్తారో కానీ.. ఆయనకు ప్రతిసారీ షాకింగ్ మేకోవర్ ఇస్తుంటారు. తెరమీద వేరే వ్యక్తిని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆయన మేకోవర్ చూస్తే.

తాజాగా సూపర్ స్టార్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వావ్ అనిపించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లుక్ వదిలారు. అది మరింతగా ఆశ్చర్య పరుస్తోంది. షర్టు తీసి బనియన్ మీద ఉన్న రజనీ.. ఒక రాడ్ పట్టుకుని చాలా ఫెరోషియస్‌గా కనిపిస్తున్నాడు. ఆయన పెద్ద ఫైటుకి రెడీ అవుతున్నట్లుగా ఉంది. ఈ లుక్‌లో రజనీ బాడీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

70వ పడికి చేరువ అవుతున్న రజనీకి ఇంత మంచి బాడీ ఉందా అనిపిస్తోంది. మరీ కండలు తిరిగి లేదు కానీ.. రజనీ వయసుకు తగ్గట్లు అయితే బాడీ లేదు. ఈ విషయంలో టెక్నికల్ మాయాజాలం జరిగిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. రజనీ మరీ అంత ఫిట్‌గా అయితే లేరని.. ఈ లుక్ ఫేక్ అని సోషల్ మీడియాలోో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకుముందు ‘వివేగం’ సినిమాకు అజిత్ లుక్ విషయంలోనూ ఇలాగే సందేహాలు నెలకొన్నాయి. సిక్స్ ప్యాక్ చిజిల్ బాడీతో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మీద రకరకాల అనుమానాలతో మీమ్స్ తయారు చేశారు. దీని మీద పెద్ద రగడే నడిచింది. చిత్ర బృందం కూడా వివరణ ఇచ్చుకుంది. ఐతే రజనీకి యాంటీ ఫ్యాన్స్ తక్కువ, పైగా ఆయన వ్యక్తిత్వం దృష్ట్యా అజిత్ ‌ను కించపరిచినట్లు జనాలేమీ కామెంట్లు చేయడం లేదు కానీ.. ఈ లుక్ అయితే ఒరిజినల్ కాదనే సందేహాలు మాత్రం చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English