ఎలాంటి ద‌ర్శ‌కుడు ఎలా అయిపోయాడ‌బ్బా..

ఎలాంటి ద‌ర్శ‌కుడు ఎలా అయిపోయాడ‌బ్బా..

బుధ‌వారం సాయంత్ర‌మే మారుతి-సాయిధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న కొత్త సినిమా ప్ర‌తి రోజూ పండ‌గే ఫ‌స్ట్ లుక్ లాంచ్ అయింది. చూడ‌గానే ఒక ఆహ్లాదం.. పాజిటివ్ ఫీల్ క‌లిగించిందీ ఫ‌స్ట్ లుక్. ఈ మ‌ధ్య కాలంలో ఇంత ఆహ్లాద‌క‌ర‌మైన ఫ‌స్ట్ లుక్ ఇంకేదీ రాలేదు అంటే అతిశ‌యోక్తి లేదు.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ఈ చిత్రం పండ‌గ‌లా ఉంటుంద‌నే భావ‌న క‌లిగించిందీ పోస్ట‌ర్. మారుతి ఇప్ప‌టిదాకా కుటుంబ ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చే ఎంట‌ర్టైన‌ర్లు తీశాడు కానీ.. ఈసారి పూర్తిగా ఫ్యామిలీస్‌నే టార్గెట్ చేసిన‌ట్లు అనిపిస్తోంది. తేజుకు సైతం ఇంత తొలి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సినిమా అయ్యేలా ఉంది.

ఐతే ఇప్పుడు ఇలాంటి సినిమా తీస్తూ.. ఇంత చ‌క్క‌టి పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మారుతి.. కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాలు, అప్పుడు అత‌డికి ఉన్న గుర్తింపు త‌లుచుకుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఈ రోజుల్లో అనే యూత్ ఫుల్ సినిమాతో అత‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. అందులో డ‌బుల్ మీనింగ్ డైలాగులు బోలెడు. కొన్ని అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు.. అమ్మాయిల్ని కించ‌ప‌రిచే ఎపిసోడ్లు కూడా ఉంటాయి. ఇక మారుతి రెండో సినిమా బ‌స్ స్టాప్ అయితే పూర్తిగా బూతుల మ‌యం. కుటుంబ ప్రేక్ష‌కులు పొర‌బాటున దాని జోలికెళ్తే అంతే సంగ‌తులు అనుకునేలా ఉంటుందా సినిమా.

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌తో మారుతి కొంచెం మారాడు కానీ.. అందులోనూ కొన్ని బూతులుంటాయి. మ‌ధ్య‌లో మారుతి నిర్మాణంలో కొన్ని బిగ్రేడ్ త‌ర‌హా సినిమాలు రావ‌డంతో అత‌డిపై బూతు డైరెక్ట‌ర్ అనే ముద్ర ప‌డింది. కానీ త‌ర్వాత భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు కొత్త మారుతి ప‌రిచ‌యం అయ్యాడు. అప్ప‌ట్నుంచి క్లీన్ మూవీస్ తీస్తూ త‌న‌పై ఉన్న బూతు ముద్ర‌ను తొల‌గించుకున్నాడు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ తీస్తూ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English