బాహుబలి చేసింది చిరంజీవి చేయగలడా?

బాహుబలి చేసింది చిరంజీవి చేయగలడా?

'సైరా' తెలుగు రాష్ట్రాల బిజినెస్‌ ఒక కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ హక్కులు ఎనభై కోట్లకి అమ్ముడయితే, నైజాం హక్కులని ముప్పయ్‌ కోట్లకి విక్రయించారు. అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి బ్రేక్‌ ఈవెన్‌కి 110 కోట్ల రూపాయలు వసూలవ్వాలి. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో వంద కోట్లకి పైగా షేర్‌ తెచ్చుకున్నది బాహుబలి చిత్రాలు మాత్రమే. మరే చిత్రానికీ ఆ ఘనత దక్కలేదు.

సాహో కూడా ఎనభై కోట్ల పరిధిలో ఆగిపోయిందే తప్ప అంతకు మించి ముందుకెళ్లలేదు. అయినా కానీ చిరంజీవి ఇమేజ్‌తో పాటు చారిత్రిక చిత్రమనే అంశం కలిసి వచ్చి దీనికి బాహుబలి చిత్రాలకి సమానమైన ఆదరణ వస్తుందని బయ్యర్లు నమ్ముతున్నారు. మంచి సెలవుల సీజన్‌లో విడుదల చేయడం కూడా దీనికి కలిసి వస్తోంది. మరి బాహుబలి తప్ప ఇంతవరకు మరెవ్వరి వల్ల కాని దానిని చిరంజీవి 'నరసింహారెడ్డి'గా చేసి చూపిస్తారా?

బాహుబలి తర్వాత వంద కోట్ల షేర్‌ దాటిన తొలి చిత్రాన్ని అందించింది చిరంజీవే కాబట్టి ఇప్పుడు కూడా మెగాస్టార్‌ని తక్కువగా చూడడానికి లేదు. సైరాకి కనుక డీసెంట్‌ టాక్‌ వచ్చినా కానీ తెలుగు రాష్ట్రాల వరకు కలక్షన్ల ఉప్పెన వుంటుందని ఫిక్స్‌ అయిపోవచ్చు. అందుకే మిగతా ఏరియాలలో సాహోకి అసలు సాటి రాకపోయినా తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ చిత్రం అదిరిపోయే బిజినెస్‌ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English