మెగా ఫాన్స్‌ని కలవర పెడుతోన్న రాజమౌళి

మెగా ఫాన్స్‌ని కలవర పెడుతోన్న రాజమౌళి

'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' చిత్రానికి సంబంధించిన ఏ గొప్ప ఎపిసోడ్‌ గురించిన బజ్‌ మీడియాలో వినిపించినా కానీ అది ఎన్టీఆర్‌ మీదే తీస్తున్నారని వస్తోంది. నిజంగానే తారక్‌ ఈ చిత్రంతో యమ బిజీగా వుంటున్నాడు. శరీరం పెంచుకుని తన పాత్ర కోసం కష్ట పడుతున్నాడు. చరణ్‌ మాత్రం ఏదో హాలిడేకి వెళ్లి వచ్చినట్టుగా షూటింగ్‌కి వెళ్లి వస్తున్నాడు.

మధ్యలో గ్యాప్‌లు ఎక్కువ తీసుకుంటూ ఫ్యామిలీ హాలిడేలు ఎంజాయ్‌ చేస్తున్నాడు. అలాగే సైరా ప్రమోషన్లపై కూడా ఫుల్‌ టైమ్‌ వర్క్‌ చేస్తున్నాడు. దీంతో 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో రామ్‌ చరణ్‌ పాత్రకి అసలు సరయిన వెయిట్‌ వుంటుందా లేదా అనే కలవరం మెగా అభిమానుల్లో మొదలయింది. ఎంతసేపు తారక్‌ మీదే భారీ పోరాట దృశ్యాలు తీస్తోన్న రాజమౌళి మరి తమ మెగా పవర్‌స్టార్‌తో అలాంటి దృశ్యాలు ఎప్పుడు తీస్తాడు? అసలు తీస్తాడా, లేదా? అంటూ ఆరాలు తీస్తున్నారు.

ఇద్దరు సమవుజ్జీలయిన హీరోలు ఒకే సినిమాలో వున్నపుడు సహజంగానే అభిమానుల్లో కలవరం వుంటుంది. వస్తోన్న వార్తలు విని ఎన్టీఆర్‌ అభిమానులు ఆనందంగా వుంటే, చరణ్‌ అభిమానుల్లో మాత్రం ఆందోళన మొదలయింది. అయితే రాజమౌళికి కూడా ఫాన్‌ వార్స్‌ గురించి బాగా తెలుసు కనుక చూస్తూ, చూస్తూ ఒకరిని పెంచి, ఒకరిని తగ్గించే సాహసం చేయడనుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English