పవన్‌పై ప్రెజర్‌ తీవ్రతరం!

పవన్‌పై ప్రెజర్‌ తీవ్రతరం!

పవన్‌కళ్యాణ్‌ 'పింక్‌' రీమేక్‌లో నటిస్తాడనేది జస్ట్‌ గాలి వార్త అయితే కాదు. ఆయనతో ఈ రీమేక్‌ చేయించడానికి ఒప్పించాలని బలమైన ప్రయత్నాలు బహు విధాలుగా జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పవన్‌ కళ్యాణ్‌కి తిరిగి నటించాలనే ఆసక్తి లేకపోయినప్పటికీ తక్కువ రోజుల వర్క్‌తో, అసలు షర్ట్‌ నలగకుండా, ఎండ తగలకుండా చేసుకునే వీలున్న సినిమా ఇదంటూ, లాభాల్లో యాభై శాతం వాటా ఇచ్చేస్తామంటూ దిల్‌ రాజు తనవంతు ఒత్తిడి చేస్తున్నాడట.

పవన్‌కళ్యాణ్‌ మొదట్లో చేయనని గట్టిగా వున్నా కానీ తర్వాత కాస్త మెత్తబడ్డాడని, ఆలోచిద్దామని చెప్పాడని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ఒక్కదానికైనా ఊ కొట్టాలే గానీ తమ చిత్రాలు కూడా చేయించేయాలని ఏ.ఎం. రత్నం, మైత్రి మూవీ మేకర్స్‌ సిద్ధంగా వున్నారు. పవన్‌కి ఇప్పుడు రాజకీయంగా చేయాల్సిన పనేమీ లేదు.

కాకపోతే మళ్లీ సినిమాలు చేస్తే తనని పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌గా చూసే ప్రమాదం వుందని ఆలోచిస్తున్నాడు. రాజకీయాల్లో ఏదైనా చేయమని ఒత్తిడి చేసే వారి కంటే సినిమాలు చేయమని అడుగుతున్న వారే తన చుట్టూ ఎక్కువ వున్న టైమ్‌లో పవన్‌ తన మాటకి కట్టుబడి వుంటాడా లేక మరో రెండు, మూడు సినిమాలు చేసేద్దామని అనుకుంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English