బిగ్‌బాస్‌పై పునర్నవి తిరుగుబాటు

బిగ్‌బాస్‌పై పునర్నవి తిరుగుబాటు

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చినా పాటించాలనేది పాలసీ. దానిపై సంతకం చేసిన తర్వాతే ఆ హౌస్‌లోకి  అందరూ వెళతారు. అయితే కొన్నిసార్లు బిగ్‌బాస్‌ పెట్టే తలకు మాసిన టాస్క్‌లు కంటెస్టెంటులని చిరాకు పెడుతుంటాయి. అయినా కానీ చాలా మంది సైలెంట్‌గా చేసేస్తుంటారు కానీ కొన్ని సార్లు ఎదురు తిరుగుతారు. దెయ్యాల టాస్క్‌ తనకి నచ్చలేదని పునర్నవి తిరుగుబాటు జెండా ఎగరేసింది.

దాంతో ఆమెతో బూట్లు పాలిష్‌ చేయించాలని బిగ్‌బాస్‌ చూసాడు. కానీ అందుకు పునర్నవి అంగీకరించలేదు. అదే శిక్ష పడిన శ్రీముఖి, మహేష్‌ కన్విన్స్‌ అయిపోయి పాలిష్‌ మొదలు పెట్టారు కానీ పునర్నవి మాత్రం అవసరమయితే ఎలిమినేట్‌ అయిపోతా కానీ అది మాత్రం చేయనంది. నిజంగా తప్పు చేసినట్టయితే శిక్ష అనుభవించేదాన్నని, కానీ తన తప్పేమీ లేకుండా శిక్ష వేయడమేంటని ఆమె ప్రశ్నించింది.

ఇప్పటికే పునర్నవికి ఓట్లు పెద్ద సంఖ్యలో పడుతున్నాయి. ఇప్పుడిలా బిగ్‌బాస్‌కి వ్యతిరేకంగా స్టాండ్‌ తీసుకోవడంతో ఆమె పాపులారిటీ యూత్‌లో మరింత పెరిగింది. ఫైనల్స్‌కి వెళ్లడం అసాధ్యమని అనుకున్న పునర్నవి ఇప్పుడు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారింది. హౌస్‌లో అవతలి వారి బలంతో సంబంధం లేకుండా నిలదీసే లక్షణమున్న అమ్మాయిగా ఈమెకి యూత్‌ ఆదరణ దక్కుతోంది. మరోవైపు శ్రీముఖి అవతలి వారిని ఇన్‌స్టిగేట్‌ చేస్తూ, తాను మాత్రం మంచి అనిపించుకోవాలనే స్ట్రాటజీని ఇంకా కొనసాగిస్తూనే వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English