అనుష్క ఫోటోషాప్‌ బడ్జెట్‌ ఎంత?

అనుష్క ఫోటోషాప్‌ బడ్జెట్‌ ఎంత?

బాహుబలి 2 చిత్రంలో అనుష్కని యంగ్‌గా చూపించాల్సిన సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ సాయంతో ఆమెని సన్నగా చూపించారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా అంగీకరించాడు. గ్రాఫిక్స్‌లో హీరోలు, హీరోయిన్లని అందంగా చూపించేయడం పెద్ద విషయం కాదు కానీ అందుకోసం గ్రాఫిక్స్‌ని, ఎఫెక్ట్స్‌ వాడితే మాత్రం నిర్మాతకి తడిసి మోపెడవుతుంది.

ఫ్రేమ్‌కి ఇంత అని వసూలు చేసే గ్రాఫిక్స్‌ డిజైనింగ్‌ కంపెనీలు కోట్ల రూపాయల ఖర్చుని నిర్మాత చేతిలో పెడుతుంటాయి. ఇవన్నీ తెరపై కనిపించవు కానీ బడ్జెట్‌లో మాత్రం యాడ్‌ అయిపోతాయి. అనుష్క సన్నబడిపోయిందంటూ ఆమె ఫోటోషాప్‌ స్టిల్స్‌ విడుదల చేసిన 'నిశ్శబ్ధం' టీమ్‌ ఫోటోషాప్‌ చేసి ఆమెని సన్నగా చూపించడానికే డిసైడ్‌ అయి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

నిశ్శబ్ధం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కూడా ఫోటోషాప్‌ మహత్యం క్లియర్‌గా కనిపిస్తోంది. మరి అనుష్క ఫోటోషాప్‌ కోసం ఎంత బడ్జెట్‌ పెట్టుకున్నారనేది తెలియదు కానీ ఇటీవల అనుష్క ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తూ కనిపించిన దానిని బట్టి చూస్తే నిశ్శబ్ధంకి ఆ అదనపు భారం భారీగానే పడేలా వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ చిత్రం తప్ప అనుష్కకి ఇంతవరకు మరో చిత్రంలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా అవకాశం రాలేదనే గాసిప్స్‌లోను నిజముందనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English