పూజా హెగ్డే పార్ట్‌ టైమ్‌ కుమ్మేస్తోంది!

పూజా హెగ్డే పార్ట్‌ టైమ్‌ కుమ్మేస్తోంది!

హీరోయిన్‌గా ఇప్పుడు నంబర్‌ వన్‌ హోదాని ఎంజాయ్‌ చేస్తోన్న పూజ హెగ్డే తన క్రేజ్‌ని పూర్తిగా క్యాష్‌ చేసుకుంటోంది. కేవలం హీరోయిన్‌గానే నటిస్తానంటూ బిగిసిపోకుండా ఎలాంటి పాత్రలు వచ్చినా కానీ ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తూ హ్యాపీగా డబ్బులు వెనకేసుకుంటోంది. ఆమెకి హీరోయిన్‌గా వచ్చే పారితోషికం కోటి కాగా, అతిథి పాత్రలు, ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తే యాభై లక్షల వరకు వస్తుంది.

అరవై రోజుల కాల్షీట్లు ఇస్తే వచ్చేదాంట్లో సగం కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుండడం, ఇలాంటి వాటి వల్ల తనకి కాల్షీట్ల సమస్య కూడా లేకపోవడంతో గ్లామర్‌ క్వీన్‌గా వున్న క్రేజ్‌ని ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంటోంది. 'వాల్మీకి' చిత్రంలో పావుగంట సేపు కనిపించే పాత్ర చేసిన పూజ హెగ్డే తాజాగా 'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడానికి ఓకే చెప్పింది.

ముందుగా తమన్నాని అనుకున్నారు కానీ ఆమెకి ఇచ్చే పారితోషికానికి పూజ ఓకే చెప్పడంతో అవుట్‌డేటెడ్‌ తమన్నా కంటే స్వింగులో వున్న పూజ బెస్ట్‌ ఆప్షన్‌ అనుకుని ఇటు మారిపోయారు. అంటే సంక్రాంతికి వచ్చే సరిలేరు నీకెవ్వరులో పూజ సాంగ్‌ వుంటే, మరో సినిమా 'అల వైకుంఠపురములో' చిత్రంలో హీరోయిన్‌గా కనిపిస్తుంది. పూజ ఫాన్స్‌కి ఈసారి పెద్ద పండగ నిజంగా పెద్ద పండగేనండోయ్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English