శ్రీదేవి కూతురికీ, సాహోకీ లింకేమిటి?

శ్రీదేవి కూతురికీ, సాహోకీ లింకేమిటి?

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ మొదట్లో దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపించలేదు. తనకి బాలీవుడ్‌ ఇండస్ట్రీ అన్నట్టుగానే వ్యవహరించింది. అయితే సాహోతో తెలుగు చిత్రాలకి పాన్‌ ఇండియా మార్కెట్‌ క్రియేట్‌ అయిందని తేలిపోవడంతో, ఇక మీదట దక్షిణాదిలో పాన్‌ ఇండియా మార్కెట్‌ని టార్గెట్‌ చేసే చిత్రాలు చాలానే వస్తాయనే నమ్మకంతో బోనీ కపూర్‌కి తెలుగు ఇండస్ట్రీపై కన్ను పడింది.

ఇక్కడి నిర్మాతలతో కలిసి తెలుగు చిత్రాలని, పాన్‌ ఇండియా చిత్రాలని నిర్మించడానికి కూడా ఆయన ఆల్రెడీ డిస్కషన్స్‌ జరుపుతున్నాడు. ఇలా తన పెద్ద కూతురిని కూడా పాన్‌ ఇండియా స్టార్‌గా మలిచేందుకు స్కోప్‌ వుండడంతో తెలుగు చిత్రాలు చేయడానికి ఓపెన్‌గా వుందనే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌.' చిత్రంలో హీరోయిన్ల కోసం వేట జరుగుతున్న టైమ్‌లో జాన్వీ పేరు పలుమార్లు తెర మీదకి వచ్చింది.

అయితే కరణ్‌ జోహార్‌కి మల్టిపుల్‌ మూవీస్‌ డీల్‌ సైన్‌ చేయడం వల్ల ఆమెకి వేరే సినిమాలు కన్సిడర్‌ చేసే అవకాశం లేకపోయింది. ఇక మీదట సాహోలాంటి చిత్రాలు ప్లానింగ్‌లో వుంటే మాత్రం జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువ. అలా శ్రీదేవి కూతురిని ఆమె తెలుగు అభిమానులు కూడా ఇక్కడి సినిమాల్లో చూసుకునే వీలుంటుందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English