రామ్‌ చరణ్‌ రంగంలోకి దిగాడు

రామ్‌ చరణ్‌ రంగంలోకి దిగాడు

సైరా ప్రమోషన్లు సరిగా లేవని సోషల్‌ మీడియాలో మెగా ఫాన్స్‌ మొత్తుకుంటున్నారు. అయితే తెలుగునాట ఈ చిత్రానికి ప్రమోషన్లు చేయడం ఎలా వున్నా కానీ హిందీ మార్కెట్‌ని ఆకర్షించాలని నిర్మాత రామ్‌ చరణ్‌ బలంగా ఫిక్సయ్యాడు. అందుకే తనకి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' షూటింగ్‌ పనులు వున్నా కానీ 'సైరా'ని స్వయంగా ప్రమోట్‌ చేయడానికి ముంబయి వెళ్లిపోయాడు.

తనకున్న బాలీవుడ్‌ కనక్షన్స్‌ ద్వారా మీడియాలో సైరాకి ఫుల్‌ కవరేజ్‌ వచ్చేలా చూసుకోవడానికి వెళ్లాడు. అలాగే తనకి మంచి స్నేహితులైన సల్మాన్‌ ఖాన్‌ లాంటి వాళ్లని సైరా ప్రమోషనల్‌ ఈవెంట్స్‌కి పిలిపించే ఆలోచన కూడా చేస్తున్నాడు. తెలుగునాట ఎలా లేదన్నా ఈ చిత్రానికి వుండే క్రేజ్‌ తగ్గదు కనుక హిందీ మార్కెట్‌ మీదే చరణ్‌ గురి పెట్టాడు.

హిందీలో బాహుబలి చిత్రాలతో పాటు సాహోకి వచ్చిన వసూళ్లని, 2.0, కెజిఎఫ్‌ లాంటి చిత్రాలు అక్కడ ఫేర్‌ చేసిన దానిని అనలైజ్‌ చేసుకుని 'సైరా'కి కూడా హిందీ మార్కెట్లో ఖచ్చితంగా ఆదరణ దక్కుతుందని చరణ్‌ నమ్ముతున్నాడు. అందుకే విడుదలకి ఇరవై రోజుల ముందుగానే ముంబయి వెళ్లి ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ వారంలోనే ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేసి, ట్రెయిలర్‌ని కూడా కొద్ది రోజుల్లో లాంఛ్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English