ప్రభాస్ పడ్డాడు.. ఎన్టీఆర్, చరణ్‌లకు టెన్షన్

ప్రభాస్ పడ్డాడు.. ఎన్టీఆర్, చరణ్‌లకు టెన్షన్

రాజమౌళితో ఒక్క సినిమాకైనా పని చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ ఆ అవకాశం అందుకున్నాక టెన్షన్ మొదలవుతుంది. జక్కన్నతో హిట్ విషయంలో ఢోకా ఉండదు. బ్లాక్ బస్టర్ ఇచ్చి మార్కెట్ పెంచుతాడు. కానీ రాజమౌళితో సినిమా తర్వాత ఆ హీరోకు పెద్ద ఫ్లాప్ ఎదురవుతుందనే నెగెటివ్ సెంటిమెంటు మాత్రం భయపెడుతుంది. దాదాపుగా ప్రతి హీరో ఈ సెంటిమెంటు బాధితుడే.

‘సింహాద్రి’ తర్వాత.. ‘యమదొంగ’ తర్వాత ఎన్టీఆర్ ఎలా ఫ్లాపులు ఎదుర్కొన్నాడో తెలిసిందే. ‘సై’ అనంతరం నితిన్.. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ.. ‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్.. ‘మగధీర’ తర్వాత రామ్ చరణ్.. ఇలా అందరూ ఎదురు దెబ్బలు తిన్నవాళ్లే. తాజాగా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సెంటిమెంటును బ్రేక్ చేస్తాడేమో అనుకున్నారు.

‘సాహో’ ఆ దిశగా ఆశలు రేపింది. కానీ ఓపెనింగ్స్‌ మోత మోగించిన ఈ చిత్రం.. ఆ తర్వాత చతికిలబడి.. చివరికి ‘డిజాస్టర్’ అనిపించుకుంటోంది. దీంతో రాజమౌళి సెంటిమెంటుకు ఢోకా లేదని తేలిపోయింది. మామూలుగా చూస్తే ఇలాంటి సెంటిమెంట్లు సిల్లీగానే అనిపిస్తాయి కానీ.. సక్సెస్ రేట్ చాలా తక్కువైన సినీ పరిశ్రమలో ఇలాంటి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. హీరోలు భయపడుతుంటారు.

ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తమ పరిస్థితి ఏంటా అని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు టెన్షన్ పడుతుంటారనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రంతో వాళ్లిద్దరూ తమ కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకుని.. మార్కెట్‌ను పెంచుకుంటామనే ఆశతో ఉన్నారు. కానీ ఈ చిత్రం తర్వాత చేసే సినిమాలతో వారికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్నదే ఇప్పుడు టెన్షనంతా. ఈ సినిమా తర్వాత వాళ్లిద్దరూ ఎవరితో పని చేస్తారో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English