‘సైరా’లో 64 గ్రామాలు.. 42 సెట్లు.. 15 వేల దుస్తులు

‘సైరా’లో 64 గ్రామాలు.. 42 సెట్లు.. 15 వేల దుస్తులు

మగధీర, బాహుబలి, సాహో తర్వాత తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవే బడ్జెట్ గురించి భయపడి ఈ సినిమా చేయడానికి వెనుకంజ వేస్తే.. ఆయన తనయుడు రామ్ చరణ్ తండ్రి కల నెరవేర్చడానికి రంగంలోకి దిగాడు. ఏమాత్రం రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించాడు.

ఇప్పటిదాకా విడుదలైన ప్రోమోలు చూస్తేనే ఈ సినిమా భారీతనం కళ్లకు కడుతోంది. సినిమాలో ఇంకా భారీతనం ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు మిగతా యూనిట్ సభ్యులూ చెబుతున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేసిన లెజెండరీ టెక్నీషియన్ రాజీవన్ కూడా అదే అంటున్నాడు. తన కెరీర్లోనే ఈ సినిమాకు కష్టపడినంతగా ఏ చిత్రానికీ కష్టపడలేదని.. ఇంత భారీ బడ్జెట్ సినిమాలో పని చేయలేదని ఆయన చెబుతుండటం విశేషం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 64 గ్రామాలకు రాజు అని.. ఆ గ్రామాలన్నీ తెరపై కనిపిస్తాయని రాజీవన్ తెలిపాడు. వీటిలో కొన్ని గ్రామాల్ని సెట్టింగ్స్ ద్వారా తీర్చిదిద్ది.. షూటింగ్ చేశామని.. మిగతా గ్రామాల్ని మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా సృష్టించామని తెలిపాడు రాజీవన్. ఈ చిత్రం కోసం ఏకంగా 42 సెట్టింగ్స్ వేసినట్లుగా రాజీవన్ వెల్లడించాడు. అందులో 15 సెట్లు చాల ా పెద్దవని.. వాటిని తెరపై చూడటానికి రెండు కళ్లూ చాలవని రాజీవన్ అన్నాడు.

 ముఖ్యంగా నౌకాశ్రయం, జగన్నాథ కొండ సెట్టింగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని.. కథ చాలా వరకు ఈ సెట్టింగ్స్ చుట్టూనే తిరుగుతుందని చెప్పాడు రాజీవన్. ఇక రెండున్నర శతాబ్దాల కిందటి మనుషుల్ని వాస్తవికంగా చూపించేందుకు దుస్తుల విషయంలో ఎన్నో నమూనాలు సేకరించామని.. కాస్ట్యూమ్ డిజైనర్ సాయంతో 22 మంది టైలర్లు ఐదు నెలల పాటు పని చేసి 15 వేల దుస్తులు కుట్టారని రాజీవన్ వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English