టికెట్ ముక్క మిగ‌ల‌కూడ‌దు-నాని

టికెట్ ముక్క మిగ‌ల‌కూడ‌దు-నాని

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ మీద ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇటు చిత్ర బృందం, అటు బ‌య్య‌ర్లు కూడా ఈ సినిమాపై చాలా ఆశ‌ల‌తో ఉన్నారు. హిట్ స్టేట‌స్ సంపాదించాలంటే ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టాలి. అది జ‌ర‌గాలంటే తొలి వారం సినిమా మంచి ఆక్యుపెన్సీతో న‌డ‌వాలి.

ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకునే సెప్టెంబ‌రు 13 నుంచి వారం పాటు టికెట్ ముక్క దొర‌క్కుండా చూడాలంటూ ప్రేక్ష‌కుల్ని ప్రేమ‌గా కోరాడు నాని. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జ‌రిగింది. అక్క‌డ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడ‌ర్ ఆడే ఏ థియేట‌ర్లో కూడా టికెట్ ఒక్క‌టీ మిగ‌ల‌కుండా చూడాల‌ని ప్రేక్ష‌కుల్ని కోరాడు నాని.

గ్యాంగ్ లీడ‌ర్ త‌న కెరీర్లో ప్ర‌త్యేక‌మైన సినిమా అని.. ఈ సినిమా చూసి ప్రేక్ష‌కులు ప‌డి ప‌డి న‌వ్వుకుంటార‌ని.. సినిమా క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని నాని చెప్పాడు. మ‌నం సినిమా ద‌గ్గ‌ర్నుంచి విక్ర‌మ్ కె.కుమార్‌తో సినిమా చేయాల‌ని అనుకుంటున్నాన‌ని.. ఐతే త‌మ ఇద్ద‌రి పేర్ల మీద గ్యాంగ్ లీడ‌ర్ రాసుంది కాబ‌ట్టి ఇప్ప‌టికి కుదిరింద‌ని నాని అన్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు హైద‌రాబాద్‌లో త‌న ప‌క్కింట్లోనే ఉంటార‌ని.. వాళ్ల‌తో కూడా సినిమా అనుకున్నా కుద‌ర్లేద‌ని.. ఇప్ప‌టికి సెట్ అయింద‌ని అన్నాడు నాని.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌తో ఒక్క సినిమా చేస్తే చాల‌నుకున్నాన‌ని.. కానీ జెర్సీ త‌ర్వాత వ‌రుస‌గా రెండో సినిమా చేస్తున్నాన‌ని.. సినిమాలో అత‌ను వినిపించ‌డ‌మే కాక క‌నిపిస్తాడ‌ని.. పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతంతో కూడా సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాడ‌ని నాని చెప్పాడు. కార్తికేయ క‌ష్ట‌ప‌డే న‌టుడ‌ని, అత‌ను అణ‌కువ‌తో ఉంటే పెద్ద స్థాయికి ఎదుగుతాడ‌ని.. గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ‌య్యాక అత‌డిని కార్తికేయ అని కాకుండా దేవ్ అని పిలుస్తార‌ని అన్నాడు నాని. తామిద్ద‌రం మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తామ‌ని.. అందులో కార్తికేయ హీరోగా న‌టిస్తే తాను విల‌న్ పాత్ర పోషిస్తాన‌ని నాని చ‌మ‌త్క‌రించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English