బాల‌య్య‌.. రోజుకు 5 గంట‌ల ఎక్స‌ర్‌సైజ్

బాల‌య్య‌.. రోజుకు 5 గంట‌ల ఎక్స‌ర్‌సైజ్

నంద‌మూరి బాల‌కృష్ణ వ‌య‌సు 59 ఏళ్లు. ఈ వ‌య‌సులో ఒంట్లో ఓపిక ఏమాత్రం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కానీ బాల‌య్య ఈ వ‌య‌సులో రోజుకు 5 గంట‌ల పాటు వ్యాయామం చేస్తున్నాడ‌ట‌. తెల్ల‌వారుజామున మూడున్న‌ర నుంచి ఆరు గంట‌ల వ‌ర‌కు.. సాయంత్రం ఇంకో గంట‌న్న‌ర పాటు జిమ్‌లో గ‌డుపుతున్నాడ‌ట‌. ఇదంతా కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న కొత్త సినిమా కోస‌మేన‌ట‌.

ఈ మ‌ధ్యే ఈ సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చిన బాల‌య్య లుక్ అంద‌రినీ షాక్‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. బాగా స‌న్న‌బ‌డి స‌రికొత్త లుక్‌లో క‌నిపించాడు బాల‌య్య‌. దీని వెనుక చాలా క‌ష్ట‌మే ఉంద‌న్న నిర్మాత సి.క‌ళ్యాణ్‌.. రోజుకు ఐదు గంట‌లు వ్యాయామం చేస్తూ బాల‌య్య శ్ర‌మిస్తున్న తీరు త‌మ‌కు బాధ క‌లిగిస్తోంద‌ని చెప్పాడు.

ఈ చిత్రంలో త‌న పాత్ర గురించి చెప్ప‌గానే బాల‌య్య త‌న బాడీ మీద దృష్టిపెట్టాడ‌ని సి.క‌ళ్యాణ్ చెప్పాడు. సినిమాలో బాల‌య్య మ‌రో పాత్ర కూడా చేస్తున్నాడ‌ని.. అది రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ సినిమాను త‌ల‌పిస్తుంద‌ని.. దాని లుక్ బ‌య‌టికి వ‌చ్చాక ఇప్పుడు చూసిన పాత్ర‌కు త‌మ్ముడా అని అంటార‌ని.. ఆ లుక్‌లో బాల‌య్య ఇంకా యంగ్‌గా క‌నిపిస్తాడ‌ని క‌ళ్యాణ్ తెలిపాడు.

బాల‌య్య సినిమాల‌కు లుక్ అనేది చాలా ముఖ్య‌మ‌ని అది బాగుంటే సినిమా 50 రోజులు గ్యారెంటీ అని.. త‌ర్వాత ఫ్లాష్ బ్యాక్ కుదిరితే 75 రోజులు ప‌క్కా అని.. ఆడియో కూడా బాగుంటే 100 రోజుల సినిమా అవుతుంద‌ని.. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమాకు ఇవ‌న్నీ కుదిరాయ‌ని.. కాబ‌ట్టి ఈ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని అన్నాడు క‌ళ్యాణ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English