బ‌న్నీ-సుకుమార్ సినిమా నుంచి అత‌ను ఔట్‌

బ‌న్నీ-సుకుమార్ సినిమా నుంచి అత‌ను ఔట్‌

కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు కొంద‌రు టెక్నీషియ‌న్ల‌తోనే సింక్ అవుతుంది. ప్ర‌తి సినిమాకూ వాళ్ల‌నే కొన‌సాగిస్తుంటారు. సుకుమార్ అలా కంటిన్యూ చేసే టెక్నీషియ‌న్ల‌లో సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఉంటారు. ఆర్య ద‌గ్గ‌ర్నుంచి వీళ్లిద్ద‌రితోనే సాగుతున్నాడు సుక్కు. డేట్ల స‌మ‌స్య వ‌ల్ల నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకు మాత్రం ర‌త్న‌వేలుతో కాకుండా విజ‌య్ చ‌క్ర‌వ‌ర్తితో ప‌ని చేశాడు సుక్కు. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లంకి మ‌ళ్లీ ర‌త్న‌వేలు లైన్లోకి వ‌చ్చేశాడు.

సుక్కు త‌ర్వాతి సినిమాకు కూడా ఆయ‌నే ప‌ని చేయాల్సింది. ఈ సినిమా కోసం లొకేష‌న్ల వేట‌లో, క‌థా చ‌ర్చ‌ల్లో కూడా ర‌త్న‌వేలు పాల్గొన్నాడు. కానీ అనివార్య ప‌రిస్థితుల్లో ఈ చిత్రం నుంచి ర‌త్న‌వేలు త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

ముందు మ‌హేష్‌తో అనుకున్న ఈ సినిమా ఎప్పుడో ప‌ట్టాలెక్కాల్సింది. కానీ ఆల‌స్య‌మైంది. దీంతో ఈ సినిమా కోసం అనుకున్న కాల్ షీట్ల‌ను స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి ఇచ్చేశాడు ర‌త్న‌వేలు. హీరోగా బ‌న్నీ వ‌చ్చాక కూడా సుక్కు సినిమా మొద‌లు కాలేదు. ఆల‌స్య‌మ‌వుతూనే ఉంది. ఏడాది చివ‌ర్లో షూటింగ్ అంటున్నారు కానీ.. అప్ప‌టికి ర‌త్న‌వేలుకు వేరే పెద్ద క‌మిట్మెంట్ ఉంది.

అదే.. భార‌తీయుడు-2. శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్లో సినిమా అంటే చిన్న వ్య‌వ‌హార‌మా? ఆ చిత్రానికి ఆల్రెడీ క‌మిట్మెంట్ ఇవ్వ‌డంతో సుక్కు-బ‌న్నీ సినిమా నుంచి ర‌త్న‌వేలు త‌ప్పుకోక త‌ప్ప‌లేద‌ట‌. దీంతో నా పేరు సూర్య‌కు ప‌ని చేసిన రాజీవ్ ర‌వి పేరును సుక్కు ప్ర‌స్తుతం ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌నే దాదాపుగా ఖ‌రార‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English