ఆ టీజ‌రేంది.. ఈ ట్రైల‌రేంది?

ఆ టీజ‌రేంది.. ఈ ట్రైల‌రేంది?

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయిన పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తున్న కొత్త సినిమా ఆర్‌డీఎక్స్ ల‌వ్. కొన్ని రోజుల కింద‌టే ఈ సినిమా టీజ‌ర్ రిలీజైంది. ఆ టీజ‌ర్ నిండా బూతులే క‌నిపించాయి. వినిపించాయి. ఒక‌టే ఇంటిమేట్ సీన్లు.. అడ‌ల్ట్ డైలాగుల‌తో మోత మోగించేసిందా టీజ‌ర్. ఒక కండోమ్ యాడ్ త‌ర‌హాలో క‌నిపించిన ఆ టీజ‌ర్ మీద విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తునే వ‌చ్చాయి.

కానీ కుర్రాళ్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఇదే స‌రైన మార్గం అని.. దానికి యూట్యూబ్‌లో వ‌చ్చిన వ్యూస్‌ను చూస్తే అర్థ‌మైంది. అయితే ఇప్పుడు ఆర్డీఎక్స్ ల‌వ్ ట్రైల‌ర్ వ‌దిలారు. టీజ‌ర్ చూసిన క‌ళ్ల‌తో ఈ ట్రైల‌ర్ చూస్తే అప్పుడు టీజ‌ర్, ఇప్పుడు ట్రైల‌ర్ ఒకే సినిమాకు సంబంధించిన‌వేనా అనే సందేహం క‌లుగుతుంది.

టీజ‌ర్లో క‌నిపించిన అంశాలేవీ అస‌లు ట్రైల‌ర్లో లేవు. టీజ‌ర్ చూస్తే యూత్ కోసం తీసిన అడ‌ల్ట్ మూవీలా క‌నిపించింది. కానీ ట్రైల‌ర్ మాత్రం ఒక కాజ్ కోసం పోరాడే అమ్మాయి స్టోరీలా క‌నిపిస్తోంది. ఇందులో ఒక్క బూతు డైలాగ్ లేదు. ఒక ఇంటిమేట్ సీన్ లేదు. పాయ‌ల్‌కు ఉన్న గ్లామ‌ర్ ఇమేజ్‌ను అస‌లు ఉప‌యోగించుకునే ప్ర‌య‌త్న‌మే జ‌ర‌గ‌లేదు ట్రైల‌ర్లో.

టీజ‌ర్ మ‌రీ చీప్‌గా ఉంద‌న్న కామెంట్లు వ‌చ్చిన నేప‌థ్యంలో అలెర్ట్ అయి.. సినిమా అస‌లు ఉద్దేశం ఇది అని చెప్ప‌ద‌లుచుకున్నారో ఏమో కానీ.. టీజ‌ర్ చూశాక ట్రైల‌ర్లో ఇంకా డోస్ ఎక్కువుంటుంద‌ని ఆశించిన కుర్రాళ్లు మాత్రం బాగా నిరాశ ప‌డిపోతున్నారు. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్న‌ట్లుంది వ్య‌వ‌హారం. హుషారు ఫేమ్ తేజ‌స్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సి.క‌ళ్యాణ్ నిర్మాత‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English