‘వాల్మీకి’ చేస్తానంటే వద్దే వద్దన్నారు

‘వాల్మీకి’ చేస్తానంటే వద్దే వద్దన్నారు

ఇప్పుడు కాలం ఎంత మారినా కూడా యువ కథానాయకులు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి సందేహిస్తారు. అందులోనూ పక్కా విలన్ పాత్ర అంటే వామ్మో అనేస్తారు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఇమేజ్ ఎలా మారిపోతుందో.. తర్వాతి సినిమాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో అని ఆలోచిస్తారు.

కానీ వరుణ్ తేజ్ అలా ఏమీ ఆలోచించకుండా ‘వాల్మీకి’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. తమిళంలో బాబీ సింహాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాత్ర అది. ఈ పాత్రను వరుణ్ చేయబోతున్నాడని వార్తలు వస్తే రూమర్ అనుకున్నారు. కానీ నిజంగానే ఆ క్యారెక్టర్ చేశాడు వరుణ్. ఐతే ఈ పాత్ర విషయంలో తనను చాలా మంది వారించినట్లుగా వరుణ్ వెల్లడించాడు.

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని సన్నిహితులు సందేహిస్తూ.. ఈ పాత్ర చేయొద్దని సలహా ఇచ్చారట. నీకిది అవసరమా.. నీకీ పాత్ర సూట్ కాదేమో.. అని రకరకాల వ్యాఖ్యలు చేశారట. ఐతే తాను ధైర్యంగా ముందడుగు వేశానని.. అయితే ఇప్పుడు ఈ సినిమా టీజర్, ట్రైలర్లో తన పాత్రను చూసి చాలా బాగుందని మెచ్చుకుంటున్నారని వరుణ్ చెప్పాడు.

నటుడిగా తన హద్దుల్ని దాటిస్తూ.. పరిధిని పెంచిన సినిమా ‘వాల్మీకి’ అని వరుణ్ చెప్పాడు. ఇదంతా దర్శకుడు హరీష్ శంకర్ తనను నమ్మడం వల్లే సాధ్యమైందని.. ఇలాంటి పాత్రకు తనను ఎంచుకున్నందుకు రుణపడి ఉంటానని అతనన్నాడు. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వాళ్లే నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించారని.. వాళ్లు ఆ పాత్రలు చేయడం తనకు ఇన్‌స్పిరేషన్ అని.. కానీ గద్దలకొండ గణేష్ పాత్ర చేసేటపుడు మాత్రం ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోకుండా.. దర్శకుడు చెప్పినట్లు తన స్టయిల్లో ఈ పాత్ర చేసుకుపోయానని వరుణ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English