పిక్ టాక్: బాబు గారి లాహిరి లాహిరి

పిక్ టాక్: బాబు గారి లాహిరి లాహిరి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ బిజీ బిజీగా కనిపించే మనిషి. చాలా వరకు ఆయన్ని సీరియస్ మోడ్‌లోనే చూస్తుంటాం. అధికారంలో ఉన్నపుడు, ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు ధ్యాసంతా రాజకీయాల మీదే ఉన్నట్లుంటుంది. కానీ ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చినట్లుంది. చంద్రబాబును ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడని విధంగా చూస్తున్నాం ఈ మధ్య.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి కోలుకున్న ఆయన హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోయారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్యే ఆయన తన భార్య భువనేశ్వరితో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తీసిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చింది.

మంగళవారం చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజట. ఈ సందర్భంగా వీరి తనయుడు నారా లోకేష్.. ఒక ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు.  దానికి ఒక వ్యాఖ్య కూడా జోడించాడు. ‘‘ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నాడు లోకేష్.

ఈ ఫొటోలో చంద్రబాబు, ఆయన సతీమణిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్లిద్దరూ ఇంత జోవియల్ మూడ్‌లో ఎన్నడూ కనిపించి ఉండరు. ముఖ్యంగా భువనేశ్వరిని ఈ లుక్, ఇంతటి ఉత్సాహంలో అరుదుగా చూస్తుంటాం. ఈ ఫొటో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English