సైరా కోసం పర్సనల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకునేదెవరు?

సైరా కోసం పర్సనల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకునేదెవరు?

సాహో, మహర్షి చిత్రాలకి నైజాంలో వచ్చిన వసూళ్లు కేవలం మల్టీప్లెక్స్‌ రేట్లని ముప్పయ్‌ శాతానికి పైగా పెంచేయడమే కారణం. ఆ చిత్రాలకి దిల్‌ రాజు పర్సనల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకుని మల్టీప్లెక్స్‌లు అన్నిట్లోను రెగ్యులర్‌ టికెట్లు రెండు వందలు, ప్రీమియమ్‌ టికెట్లు మూడొందల యాభై అమ్మేటట్టు చూసాడు. దీంతో గ్రాస్‌ వసూళ్లలో విపరీతమైన తేడా కనిపించింది. ఇదే విధంగా సైరాకి కూడా చేసినట్టయితే తప్పకుండా నైజాంలో దిమ్మ తిరిగే వసూళ్లు వస్తాయి.

అయితే సైరాకి అంతగా పర్సనల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకుని ఇదంతా జరిగేటట్టు చూసుకునేదెవరు? సైరా హక్కులని యువి సంస్థ దక్కించుకుంది. ముప్పయ్‌ కోట్లకి ఎన్‌ఆర్‌ఏ పద్ధతిలో సైరా నైజాం హక్కులని వారికి ఇచ్చారు. వాళ్లు కనుక సాహో, మహర్షి మాదిరిగా రేట్లు హైక్‌ చేయగలిగినట్టయితే ముప్పయ్‌ కోట్లు వారం లేదా పది రోజుల్లోనే తిరిగి రావడానికి ఆస్కారముంటుంది.

రామ్‌ చరణ్‌ స్వయంగా ఆదేశాలు జారీ చేసి పోస్ట్‌ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా శ్రద్ధ పెడితే, అలాగే అభిమానుల మనసు తెలుసుకుని రికార్డుల మీద కూడా కాన్సన్‌ట్రేట్‌ చేస్తే ఇదంతా సాధ్యపడుతుంది. మరి చరణ్‌ పోస్ట్‌ రిలీజ్‌ పర్‌ఫార్మెన్స్‌తో పాటు రికార్డుల గురించి కూడా ఆలోచిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English