మన్మథుడి డిజాస్టర్‌తో చైతన్య గుబులు!

మన్మథుడి డిజాస్టర్‌తో చైతన్య గుబులు!

ప్లేబాయ్‌ తరహా పాత్రలు అక్కినేని హీరోలకి సూట్‌ అవుతాయనే ఉద్దేశంతో అఖిల్‌తో మిస్టర్‌ మజ్ను తీసారు. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. తనకున్న మన్మథుడి ఇమేజ్‌ ఈ ఏజ్‌లోను వర్కవుట్‌ అవుతుందనే నమ్మకంతో నాగార్జున మన్మథుడు 2 చేసారు. దానిని ఆడియన్స్‌ డిజాస్టర్‌ చేసారు. దీంతో అంతవరకు అలాంటి తరహా పాత్ర చేయడానికి అంగీకరించిన నాగ చైతన్య మనసు మార్చుకున్నాడు.

'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్‌ అయిన 'బంగార్రాజు'లో చైతన్య ప్లేబాయ్‌ తరహా పాత్ర చేయాల్సి వుంది. ముందు ఆ కథ ఓకే అనేసుకున్నారు. నాగార్జున, చైతన్య కాంబినేషన్‌లో కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు త్వరలోనే మొదలు కావాల్సి వుంది. అయితే మన్మథుడు 2 ఫలితం చూసిన తర్వాత చైతన్య మనసు మార్చుకున్నాడు.

అలాంటి పాత్ర ఇక తాను చేయనని, వేరేలా పాత్రని తీర్చిదిద్దడం లేదా కొత్త కథని తయారు చేయడం బెటర్‌ అని కళ్యాణ్‌కృష్ణకి చెప్పేసాడు. అలాంటి క్యారెక్టరైజేషన్‌ వున్న కథలు ఇటీవల విన్నా కానీ అన్నిటినీ చైతన్య రిజెక్ట్‌ చేసేసాడు. మిస్టర్‌ మజ్ను ఫెయిల్‌ అయినా కానీ ఆ పాత్ర మీద ఆసక్తి చూపించిన చైతన్య తండ్రికి వచ్చిన ఫలితం చూసి ఇక అలాంటి పాత్రలే చేయనని చెప్పేస్తున్నాడు. దీంతో ప్రస్తుతానికి బంగార్రాజు ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English