దిల్‌ రాజు కల పవన్‌ కళ్యాణ్‌ తీరుస్తాడా?

దిల్‌ రాజు కల పవన్‌ కళ్యాణ్‌ తీరుస్తాడా?

ఇరవై ఒకటవ శతాబ్ధంలోని తెలుగు సినిమా అగ్ర హీరోలు అందరితో సినిమాలు నిర్మించిన దిల్‌ రాజు ఇంతవరకు పవన్‌కళ్యాణ్‌తో మాత్రం సినిమా తీయలేకపోయాడు. అదొక్కటే తన కెరియర్‌లో అతి పెద్ద వెలితి అని దిల్‌ రాజు పలుమార్లు చెప్పాడు. పవన్‌తో ఎలాగైనా సినిమా తీయాలని చూసిన దిల్‌ రాజు ఇంతకుముందు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

అయితే పవన్‌ రాజకీయాలతో బిజీ అవడంతో ఇక దిల్‌ రాజు కల కలగానే మిగిలిపోతుందని భావించారు. అయితే పవన్‌ని ఎలాగైనా ఒప్పించి ఒక సినిమా తీయాలని దిల్‌ రాజు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. హిందీ చిత్రం పింక్‌ రీమేక్‌ ఇటీవలే తమిళంలో అజిత్‌ చేస్తే బ్రహ్మాండమైన హిట్టయింది. ఆ చిత్రాన్ని తెలుగులో పవన్‌తో చేస్తే బాగుంటుందని దిల్‌ రాజు భావిస్తున్నాడట.

ఈ పాత్రకి పవన్‌ కేవలం నలభై రోజులు కాల్షీట్లు ఇచ్చినా సరిపోతుంది కనుక ఇది అతని రాజకీయ ప్రణాళికని ఇబ్బంది పెట్టని అవకాశమని, కనుక పవన్‌ ఆలోచిస్తాడని దిల్‌ రాజు బాగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇకపై సినిమాలు చేయనని పవన్‌ పదే పదే చెబుతూ వస్తున్నాడు కనుక దిల్‌ రాజు ఈ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్‌ అవుతాడనేది తెలియదు.

కానీ అభిమానులకి మాత్రం ఈ చిత్రం చేస్తే పవన్‌కి లేడీస్‌లో ఫాలోయింగ్‌ బాగా పెరుగుతుందనే ఫీలింగ్‌ వుంది. పింక్‌ లాంటి చిత్రాలు పవన్‌ పొలిటికల్‌ ఇమేజ్‌కి కూడా హెల్ప్‌ అవుతాయనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English