స‌ల్మాన్ అయితే ఏంటి.. అక్ష‌య్ ఇక్క‌డ‌

స‌ల్మాన్ అయితే ఏంటి.. అక్ష‌య్ ఇక్క‌డ‌

ఖాన్ త్ర‌యంతో పోలిస్తే ఒక‌ప్పుడు అక్ష‌య్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ చాలా త‌క్కువ‌. అంత‌రం చాలా ఉండేది. కానీ గ‌త కొన్నేళ్ల‌లో క‌థ మారింది. షారుఖ్ అనేవాడిని అక్ష‌య్ ఎప్పుడో దాటేశాడు. ఆమిర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్‌ల‌కు కూడా పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు. వాళ్లు ఏడాదికో సినిమా చేసి ఎంత సంపాదిస్తారో.. ఆమిర్ ఏడాదిలో రెండు మూడు సినిమాల్లో న‌టించి వాళ్ల‌ను మించి ఆర్జిస్తున్నాడు.

ఈ ఏడాదికి ఇండియాలో అత్య‌ధిక ఆదాయం పొందిన న‌టుడు అత‌నే కావ‌డం విశేషం. ఇలా ఆద‌రాబాద‌రా సినిమాలు చేసేస్తాడు కాబ‌ట్టి క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ‌తాడ‌నుకుంటే పొర‌బాటే. ఆ విష‌యంలో ఏమీ ఢోకా ఉండదు. ఈ ఏడాది కేస‌రి, మిష‌న్ మంగ‌ల్ సినిమాల‌తో ప‌ల‌క‌రించాడ‌త‌ను. రెండూ క్రిటిక‌ల్ అక్లైమ్ పొందాయి. భారీ వ‌సూళ్లూ రాబ‌ట్టాయి.

సినిమా సినిమాకూ రేంజ్ పెంచుకుంటున్న అక్ష‌య్.. ఇప్పుడు బాలీవుడ్లో ఎవ‌రూ చేయ‌ని సాహ‌సానికి రెడీ అయిపోయాడు. అత‌ను బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నేరుగా స‌ల్మాన్ ఖాన్‌ను ఢీకొట్ట‌బోతున్నాడు. అది కూడా రంజాన్ పండ‌క్కి కావ‌డం విశేషం. చాలా ఏళ్ల నుంచి రంజాన్ అంటే స‌ల్మాన్ సినిమానే వ‌స్తోంది. ఈ పండుగ‌ను అత‌డికే రాసిచ్చేశారు. వ‌చ్చే ఏడాది స‌ల్మాన్.. బ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే ఇన్షా అల్లాతో రంజాన్ రోజు రంగంలోకి దిగాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది.

దీని బ‌దులు సాజిద్ న‌డియాడ్‌వాలాతో అనుకున్న కిక్‌-2తో రాబోతున్నాడు స‌ల్మాన్. ఐతే దీనికి పోటీగా త‌న కొత్త సినిమా ల‌క్ష్మీబాంబ్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాడు అక్ష‌య్. తాజాగా అత‌ను త‌న మూడు కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించాడు. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న ల‌క్ష్మీబాంబ్ (కాంఛ‌న రీమేక్‌) 2020 ఈద్‌కు వ‌స్తుంద‌న్నాడు. వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి పృథ్వీరాజ్‌, క్రిస్మ‌స్‌కి బ‌చ్చ‌న్ పాండే చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తాన‌ని కూడా అత‌ను ప్ర‌క‌టించాడు. స‌ల్మాన్‌ను ఈద్ రోజు ఢీకొట్ట‌డం అంటే అక్ష‌య్ గ‌ట్స్‌కి స‌లాం కొట్టాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English