దిల్‌ రాజు నష్టానికి ప్రభాస్‌ పరిహారం?

దిల్‌ రాజు నష్టానికి ప్రభాస్‌ పరిహారం?

సాహో చిత్రాన్ని బాహుబలి 2కి తీసిపోదనే నమ్మకంతో భారీ రేట్లకి కొనేసారు. నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలని యాభై ఆరు కోట్లకి దిల్‌ రాజు తీసుకున్నాడు. ప్రకటించుకుంటోన్న షేర్ల మాట అటుంచితే, ఈ రెండు చోట్ల కలిపి సాలిడ్‌గా ఇరవై కోట్ల వరకు దిల్‌ రాజు నష్టపోతాడు. ఒకటి, రెండు లేదా అయిదు కోట్ల నష్టమయితే భరిస్తారు కానీ మరీ ఇంత డిఫరెన్స్‌ వస్తే ఎవరో ఒకరు కాంపన్సేట్‌ చేయక తప్పదు.

లేదంటే హీరో తదుపరి చిత్రాల బిజినెస్‌పై అది ప్రభావం చూపించడమే కాకుండా అతడి గుడ్‌విల్‌ని కూడా దెబ్బ తీస్తుంది. అందుకే ఈ నష్టాన్ని, అలాగే రిలీజ్‌ సమస్య తలెత్తినపుడు దిల్‌ రాజు ఇచ్చిన పది కోట్లని ఒకేసారి చెల్లించేలా ప్రభాస్‌ అతనికి డేట్స్‌ ఇస్తాడని తెలిసింది. అయితే ప్రభాస్‌ ఈ చిత్రం ఎప్పుడు చేసేదీ ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం ప్రభాస్‌ పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసమే చూస్తున్నాడు. తన సినిమాలన్నీ ఖచ్చితంగా హిందీలో విడుదల కావాలని అతను కోరుకుంటున్నాడు. ప్రభాస్‌తో సినిమా తీసే ముందుగా హిందీ నిర్మాణ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు దిల్‌ రాజు 'జెర్సీ' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాడు. ఎవ్రీథింగ్‌ ఈజ్‌ ఇంటర్‌లింక్డ్‌ అంటే ఇదేనేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English