మహేష్‌, అల్లు అర్జున్‌ మధ్య తెగని బేరం!

మహేష్‌, అల్లు అర్జున్‌ మధ్య తెగని బేరం!

సంక్రాంతికి రెండు భారీ సినిమాలు వస్తున్నాయంటే సినీ ప్రియులకి సందడే కానీ ఆయా చిత్రాలని కొన్న వారికి, తీస్తున్న వారికి మాత్రం పోటీతో ఎప్పుడూ తలనొప్పే. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలకి ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు. పండుగ మంగళవారం కావడంతో ఎవరూ వీకెండ్‌ని మిస్‌ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. దీంతో జనవరి 10 డేట్‌ హాట్‌గా మారింది.

ఒకవైపు మహేష్‌-అనిల్‌ రావిపూడి కాగా, మరోవైపు అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ కావడంతో రెండూ ఓవర్సీస్‌ మార్కెట్‌లో హాట్‌ చిత్రాలే. దీంతో ఆ మార్కెట్‌ని కోల్పోవడానికి ఎవరూ అంగీకరించడం లేదు. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య డైరెక్ట్‌ క్లాష్‌ లేదా వన్‌ డే గ్యాప్‌ వుంటుందనిపిస్తోంది. ఇవి కాకుండా రజనీకాంత్‌ - మురుగదాస్‌ల సినిమా 'దర్బార్‌' కూడా అదే డేట్‌ని టార్గెట్‌ చేస్తున్నట్టు తెలిసింది.

సంక్రాంతి పండుగ వల్ల ఒక రోజు అటు, ఇటు అయినా లోకల్‌ మార్కెట్‌లో వచ్చే తేడా ఏమీ వుండదు కానీ ఓవర్సీస్‌లో మాత్రం కనీసం మిలియన్‌ నుంచి మిలియన్నర తేడా అయినా పడుతుంది. అంత రిస్క్‌ చేయడానికి ఇరు పార్టీలు సిద్ధంగా లేకపోవడంతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారింది. రెండు సినిమాల నిర్మాతలు తమ ప్రాజెక్టులపై అపరిమితమైన నమ్మకంతో వుండడంతో ఎవరూ వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English