సాహో సగానికి సగం ఔట్‌!

సాహో సగానికి సగం ఔట్‌!

సాహో మళ్లీ పుంజుకుంటుందనే ఆశలపై సెకండ్‌ వీకెండ్‌ నీళ్లు చల్లేసింది. రెండవ వారాంతంలో నాలుగు కోట్ల వసూళ్లు కూడా తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రన్‌ ముగిసినట్టే అనుకోవాలి. మంగళవారం పాక్షిక సెలవు వల్ల కాసిని వసూళ్లు చూడవచ్చు కానీ శని, ఆదివారాల్లోనే జరగని అద్భుతాలని ఇక ఆశించనవసరం లేదు.

దీంతో బయ్యర్లు, నిర్మాతలు లెక్కల చిట్టాలు బయటకి తీస్తున్నారట. మొదటి వారంలో వసూళ్లు ఎక్కువ చూపించుకోవడానికి, తద్వారా ప్రేక్షకులని థియేటర్లకి రప్పించడానికి ఫేక్‌ నంబర్లు బాగానే ప్రచారం చేసుకున్నారు కానీ అసలు లెక్కలు చూసుకుంటే దాదాపుగా అందరికీ సగానికి సగం పోయినట్టేనని ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.

లక్కీగా హిందీలో గ్రాస్‌ బాగా రావడం వల్ల 'తిమ్మిని బమ్మి' చేసి చూపించడానికి వీరికో ఆస్కారం దొరికింది. కానీ హిందీ మార్కెట్లని మినహాయిస్తే అన్ని చోట్లా సాహో మార్కెట్‌ని అతలాకుతలం చేసి పోయింది. దీని ప్రభావం రానున్న సినిమాలపై కూడా పడవచ్చునని అంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందనేది అర్థమవుతోంది. ఇదిలావుంటే సాహో ఫలితంతో షాక్‌ తిన్న ప్రభాస్‌, యువి క్రియేషన్స్‌ తాము రూపొందిస్తోన్న 'జాన్‌' ప్రాజెక్ట్‌ని పునఃసమీక్షించుకునే పనిలో పడ్డారని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English