పాపం.. ఆ నటుడి కుటుంబం అన్ని కష్టాలు పడింది

పాపం.. ఆ నటుడి కుటుంబం అన్ని కష్టాలు పడింది

‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఐశ్వర్యా రాజేష్. దీని కంటే ముందు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినా పెద్ద గుర్తింపు రాలేదు. ఆమె తెలుగమ్మాయి అని చాలా మందికి తెలియదు. 80ల్లో జంధ్యాల సినిమాలు చాలా వాటిలో కనిపించిన సీనియర్ నటుడు రాజేష్ తనయురాలే ఈ ఐశ్వర్య.

ఒక దశలో వరుసగా సినిమాలు చేసిన రాజేష్.. ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి మాయమయ్యాడు. తర్వాత కొన్నేళ్లకు ఆయన చనిపోయినట్లు వార్త వచ్చింది. అంతే ఆపై రాజేష్ కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ఏమీ తెలియదు. ఆయన కుటుంబం చెన్నైలోనే స్థిరపడటంతో ఏ అప్ డేట్ లేకపోయింది. ఇప్పుడేమో ఐశ్వర్య హీరోయిన్ అయి తమిళంలో మంచి పేరు సంపాదించింది. హీరోయిన్‌గా మంచి స్థాయినే అందుకుంది. ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగుపెట్టింది.

ఈమె ఈ స్థాయికి చేరుకుందంటే తండ్రి బాగానే డబ్బులు సంపాదించి పెట్టి ఉంటాడు.. ఆ కుటుంబానికి ఏ ఢోకా ఉండి ఉండదు అనుకుంటాం. కానీ అదేమీ లేదట. రాజేష్ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందట. రాజేష్ సినిమాల్లో బాగానే సంపాదించినా.. వాళ్లకు వీళ్లకూ సాయం చేయడం ద్వారా చాలా డబ్బులు కరిగిపోయాయట. ఇక ఆయన అనారోగ్యం పాలవడంతో చికిత్స కోసం ఆస్తులు కరిగిపోయాయట. తాగుడుకు బానిసైన రాజేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడట. ఐశ్వర్యకు ఎనిమిదేళ్ల వయసుండగా అతను మరణించాడట.

తండ్రితో పాటే తమ ఐశ్వర్యం అంతా పోయిందని.. చివరగా ఒక ఫ్లాట్ మిగిలితే.. అప్పుల వాళ్ల ఒత్తిడి భరించలేక దాన్ని కూడా అమ్మేయాల్సి వచ్చిందని ఐశ్వర్య తెలిపింది. తమ తల్లి ఎల్ఐసీ ఏజెంట్‌గా మారి కుటుంబాన్ని పోషించిందని.. అనేక ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుని తాము పెరిగి పెద్దవాళ్లం అయ్యామని ఐశ్వర్య తెలిపింది. తాను సినీరంగంలోకి రావాలనుకున్నపుడు కూడా ఎవరూ రెడ్ కార్పెట్ ఏమీ వేయలేదని.. నీ కలర్‌కు హీరోయిన్ అవుతావా అని అవమానించారని.. కానీ పట్టుదలతో ప్రయత్నించి.. 21 ఏళ్ల వయసులో ‘కాకా ముట్టై’లో ఇద్దరు పిల్లల తల్లిగా డీగ్లామరస్ రోల్ చేసి నటిగా గుర్తింపు సంపాదించానని.. కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని ఐశ్వర్య చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English