ర‌క్తంలో త‌డిసి ముద్ద‌యిన ధ‌నుష్‌

ర‌క్తంలో త‌డిసి ముద్ద‌యిన ధ‌నుష్‌

చూడ‌టానికి బ‌క్క‌గా, పీల‌గా చాలా సాధార‌ణంగా క‌నిపిస్తాడు త‌మిళ క‌థానాయ‌కుడు ధ‌నుష్‌. కానీ తెర‌మీద అత‌డి క్యారెక్ట‌ర్లు.. త‌న‌ అవ‌తారాలు.. న‌ట‌న‌లో ఇంటెన్సిటీ చూస్తే భ‌యం క‌లుగుతుంది. కెరీర్లో వ‌యొలెన్స్ నిండిన చాలా సినిమాలు చేశాడ‌త‌ను. ఇప్పుడ‌త‌ను మ‌రో వ‌యొలెంట్ మూవీతో రెడీ అయ్యాడు. అదే.. అసుర‌న్.

ఇప్ప‌టిదాకా రిలీజ్ చేసిన ‘అసురన్’ ప్ర‌తి పోస్ట‌ర్లోనూ ధ‌నుష్ చాలా వ‌యొలెంట్‌గా క‌నిపించాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైల‌ర్లో అత‌ను ఇంకా వ‌యొలెంట్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు. క‌త్తి ప‌ట్టుకుని వీరంగం చేసిన ధ‌నుష్.. రక్తంలో తడిసి ముద్దయిపోయాడు. నడి వయస్కుడిగా ధనుష్ లుక్, మేకోవర్ అదిరిపోయిందనే చెప్పాలి. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే యంగ్ లుక్‌లోనూ ఆకట్టుకున్నాడు.

గ్రామీణ నేపథ్యంలో అణగారిన వర్గాలపై బడా బాబులు చేసే అఘాయిత్యాలు.. వాటిని ఎదిరించి నిలబడే ఒక సామాన్యుడు.. ఈ సెటప్‌లో సినిమా సాగేలా ఉంది. ట్రైలర్ అంతటా ఒక ఇంటెన్సిటీ కనిపించింది.

ధ‌నుష్‌తో పొల్లాద‌వ‌న్, ఆడుగ‌లం, వడ చెన్నై లాంటి కల్ట్ మూవీస్ అందించిన వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వీళ్ల క‌ల‌యిక‌లో వస్తున్న నాలుగో చిత్ర‌మిది. త‌న‌కంటే 5 ఏళ్లు పెద్ద‌దైన మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్‌తో ధ‌నుష్ ఈ సినిమాలో జ‌త క‌డుతుండ‌టం విశేషం. దసరా కానుకగా అక్టోబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English