2.0 అక్క‌డ‌ డిజాస్ట‌ర్

2.0 అక్క‌డ‌ డిజాస్ట‌ర్

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఏకంగా రూ.545 కోట్ల ఖ‌ర్చుతో తెర‌కెక్కిన సినిమా 2.0. ఐతే ప‌రిమిత బ‌డ్జెట్లోనే రోబో సినిమాలో అద్భుతాలు చూపించిన శంక‌ర్.. ఈ సారి ఇంత బ‌డ్జెట్ ఉండి కూడా ప్రేక్ష‌కుల్ని సంతృప్తి ప‌రిచే సినిమా అందించ‌లేక‌పోయాడు. పెట్టిన బడ్జెట్‌కి సినిమాలో కంటెంట్‌కి పొంతన కుదరకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు.

రికార్డులు బద్దలు కొట్టడం సంగతలా ఉంచితే.. పెట్టుబడి కూడా వెనక్కి తేలేక కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది ‘2.0’. అడ్డూ అదుపూ లేకుండా ఈ సినిమాపై ఖ‌ర్చు పెట్టిన‌ లైకా ప్రొడక్షన్స్ సంస్థ‌ నష్టాలు మూటగట్టుకోక తప్పలేదు. ఐతే భార‌తీయ చిత్రాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న చైనాలో 2.0ను రిలీజ్ చేయడం ద్వారా కొంత మేర నష్టాలు భర్తీ చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఐతే విడుద‌ల‌లో ఆల‌స్యం జ‌రిగింది.

ఇండియాలో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత చైనాలో ఇటీవ‌లే విడుద‌లైంది 2.0. ఇండియాలో 2.0 విడుద‌లైంది దాదాపు 10 వేల థియేట‌ర్ల‌లో కాగా.. చైనాలో ఒకేసారి ఏకంగా 50 వేల స్క్రీన్ల‌లో రిలీజ్ చేశారు. వాటిలో చాలా వ‌ర‌కు త్రీడీ స్క్రీన్లే. ఇంత భారీగా సినిమాను రిలీజ్ చేస్తే 2.0 తొలి రోజు 1.3 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. రెండో రోజు వ‌సూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. అందులో స‌గ‌మే వ‌చ్చింది.

చైనాలో వ‌సూల‌య్యే గ్రాస్ వ‌సూళ్ల‌లో నిర్మాత‌ల చేతికి వ‌చ్చేది 20 శాత‌మే. అంటే రెండు రోజుల్లో వ‌సూలైన 14 కోట్ల‌లో నిర్మాత‌ల‌కు వ‌చ్చేది రెండున్న‌ర కోట్లు మాత్ర‌మే. ఈ చిత్రం 20 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూలు చేస్తే త‌ప్ప చైనాలో బ్రేక్ ఈవెన్‌కు రాదు. కానీ ఓపెనింగ్స్ చూస్తే అందుకు అవ‌కాశ‌మే లేద‌ని తెలుస్తోంది. రిలీజ్ ఖ‌ర్చులు వెన‌క్కి రావ‌డ‌మే క‌ష్ట‌మ‌నిపిస్తోంది. ఇంత కాలం ఎదురు చూసి, ఎంతో ప్ర‌యాస‌తో రిలీజ్ చేస్తే ఇలాంటి రెస్పాన్స్ రావ‌డం 2.0 నిర్మాత‌ల్ని షాక్‌కు గురి చేసే ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English