అప్పుడు వ‌దిలేసి.. ఇప్పుడు ఆరాట‌ప‌డుతున్నాడు

అప్పుడు వ‌దిలేసి.. ఇప్పుడు ఆరాట‌ప‌డుతున్నాడు

ఈగ సినిమాలో విల‌న్ పాత్ర‌తో సుదీప్‌కు తెలుగులో వ‌చ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. బ‌హుశా ఏ క‌న్న‌డ న‌టుడూ తెలుగులో ఒక్క సినిమాతో ఇంత పాపుల‌ర్ అయి ఉండ‌డేమో. క‌న్న‌డ ప్ర‌భాక‌ర్, దేవ‌రాజ్ లాంటి వాళ్లు కొంద‌రున్నా వాళ్లు ఇక్క‌డ పేరు సంపాదిండానికి చాలా కాలం ప‌ట్టింది. కానీ సుదీప్ ఒక్క చిత్రంతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌మైన ముద్ర వేశాడు. ఆ పాపులారిటీని స‌రిగ్గా వాడుకుని ఉంటే తెలుగులో అత‌డికి మంచి మార్కెట్ ఏర్ప‌డేదేమో.

ఐతే టాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ స‌రైన రోల్స్ ఇవ్వ‌లేదా.. లేక సుదీప్ ఎంపిక స‌రిగా లేదా అన్న‌ది చెప్ప‌లేం కానీ.. అత‌ను ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోలేదు. యాక్ష‌న్ 3డి, బాహుబ‌లి లాంటి సినిమాల్లో అత‌ను చేసిన రోల్స్ పెద్ద‌గా గుర్తింపునివ్వ‌లేదు. ఆ త‌ర్వాత అత‌ను తెలుగు సినిమాల్లో క‌నిపించ‌నే లేదు.

ఇప్పుడు చాన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత ప‌హిల్వాన్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు సుదీప్. పోయినేడాది కేజీఎఫ్ సినిమా తెలుగులోనూ సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో య‌శ్ కంటే మంచి ఇమేజ్ ఉండి, తెలుగులో గుర్తింపు  కూడా ఉండి తానెందుకు ఇక్క‌డి మార్కెట్ మీద దృష్టిపెట్ట‌కూడ‌ద‌ని ప‌హిల్వాన్ చిత్రాన్ని తెలుగులోకి కూడా తెస్తున్నాడు సుదీప్. ఈ చిత్రం హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ రిలీజ‌వుతోంది. కేజీఎఫ్ సినిమా అంటే దాని కంటెంట్ వేరు, టేకింగ్ వేరు, రేంజ్ వేరు, విడుద‌ల‌కు ముందు వ‌చ్చిన హైప్ వేరు.

కానీ ప‌హిల్వాన్ సినిమాలో అలాంటి ప్ర‌త్యేక‌త ఏమీ క‌నిపించ‌డం లేదు. దీని ప్రోమోలు మామూలుగానే అనిపిస్తున్నాయి. కేజీఎఫ్ లాగా జ‌నాల్లో ఇది ఆస‌క్తి రేకెత్తించ‌లేక‌పోయింది. కేజీఎఫ్‌ను తెలుగులో రిలీజ్ చేసిన సాయి కొర్ర‌పాటే ఈ చిత్రాన్ని కూడా విడుద‌ల చేస్తున్నా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. అయినా ఇప్పుడు సుదీప్‌ను తెలుగు ప్రేక్ష‌కులు లైట్ తీసుకునే స్థితిలో ఉన్నారు. ఈగ త‌ర్వాత ఇలాంటి ప్ర‌య‌త్నం జ‌రిగి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదేమో. ఈ స్థితిలో ప‌హిల్వాన్ తెలుగులో ఏమైనా మ్యాజిక్ చేస్తుందా అంటే సందేహ‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English