వి-ఎపిక్ వెల‌వెల‌

వి-ఎపిక్ వెల‌వెల‌

హైద‌రాబాద్‌లో మ‌హేష్ బాబు మ‌ల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ ప్రారంభ‌మైన‌పుడు ఎంత హ‌డావుడి జ‌రిగిందో.. ఇటీవ‌ల సూళ్లూరుపేట‌లో వి-ఎపిక్ అనే మ‌ల్టీప్లెక్స్ ఆరంభ‌మైన సంద‌ర్భంగా కూడా అంతే హంగామా క‌నిపించింది. మీడియాలో, సోష‌ల్ మీడియాలో దీని గురించి వార్త‌లు వెల్లువెత్తాయి. సౌత్ ఏషియాలోనే అత్యంత పెద్ద‌ది అంటూ ఇక్క‌డి ఓ స్క్రీన్ గురించి ఓ రేంజిలో ప్ర‌చారం జ‌రిగింది. ఒక‌సారి వెళ్లి అక్క‌డ సినిమా చూసి రావాల‌నిపించేలా ఈ స్క్రీన్ విశేషాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

సాహో సినిమాను నిర్మించిన ప్ర‌భాస్ మిత్రులు వంశీ-ప్ర‌మోద్‌ల‌దే ఈ మ‌ల్టీప్లెక్స్ అన్న సంగ‌తి తెలిసిందే. సాహో చిత్రంతోనే ఇది అందుబాటులోకి వ‌చ్చింది. దీనికి వ‌చ్చిన హైప్ దృష్ట్యా తొలి వీకెండ్ మొత్తానికి ముందే టికెట్లు బుక్ అయిపోయాయి.

వి-ఎపిక్‌లో తొలి మూడు నాలుగు రోజుల వ‌సూళ్ల గురించి కూడా గొప్ప‌గా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితి ఏమాత్రం బాగా లేదు. పెద్ద స్క్రీన్‌తో పాటు మిగ‌తా రెండు స్క్రీన్లూ వెల‌వెల‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇది సూళ్లూరు పేట టౌన్ శివార్ల‌లో ఉంది. అక్క‌డికి రెగ్యుల‌ర్ సినీ గోయ‌ర్స్ మిగ‌తా థియేట‌ర్ల‌కు వెళ్లిన‌ట్లు వెళ్ల‌డం క‌ష్టం. హైద‌రాబాద్, వైజాగ్ లాంటి సిటీలైతే ఓకే కానీ.. సూళ్లూరు పేట లాంటి టౌన్లో ఆక్యుపెన్సీ క‌ష్ట‌మ‌వుతుంది.

అందులోనూ సాహో సినిమాకు డివైడ్ టాక్ రావ‌డంతో వినాయ‌క‌చ‌వితి సెల‌వు త‌ర్వాత థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి. బిగ్ స్క్రీన్లో ఓ మోస్త‌రుగా ఆక్యుపెన్సీ ఉండ‌గా.. మిగ‌తా రెండు స్క్రీన్లు అస‌లు న‌డిచే ప‌రిస్థితి లేద‌ట‌. వ‌సూళ్లు మెయింటైనెన్స్‌కు కూడా స‌రిపోయేలా లేక‌పోవ‌డంతో చిన్న స్క్రీన్ల‌లో ఒక‌దాన్ని మూత‌వేశార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English