రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురి కోసం ఇంట్రెస్టింగ్ సెట‌ప్

రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురి కోసం ఇంట్రెస్టింగ్ సెట‌ప్

సినీ కుటుంబాల నుంచి అమ్మాయిలు ఇండ‌స్ట్రీలోకి రావ‌డం చాలా క‌ష్టంగా ఉండేది ఒక‌ప్పుడు. కానీ గ‌త కొన్నేళ్ల‌లో ప‌రిస్థితులు కొంచెం మారాయి. పెద్ద ఫ్యామిలీస్ నుంచి కూడా అమ్మాయిలు సినిమాల్లో అడుగు పెడుతున్నారు. మంచు ల‌క్ష్మి, కొణిదెల నిహారిక లాంటి వాళ్లు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఈ కోవ‌లోనే రాజ‌శేఖ‌ర్ ఇద్ద‌రు కూతుళ్లు కూడా సినిమాల వైపు అడుగులేశారు. కానీ ముందు ఎంట్రీ ఇవ్వాల్సిన రాజ‌శేఖ‌ర్ పెద్ద‌మ్మాయి శివానికి బ్రేక్ ప‌డిపోగా.. చిన్న‌మ్మాయి శివాత్మిక దొర‌సాని సినిమాతో అరంగేట్రం చేసేసింది.

శివాని క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కావాల్సిన 2 స్టేట్స్ రీమేక్ వివాదంలో చిక్కుకుని మ‌ధ్య‌లో ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సంగ‌తి ఎటూ తేల‌క‌పోగా.. మ‌రో చిత్రం ద్వారా ఆమెను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేయ‌డానికి రంగం సిద్ధ‌మైంది.

బాల న‌టుడిగా మంచి పేరు సంపాదించి.. ఇటీవ‌లే ఓ బేబీ సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌తో ప‌ల‌క‌రించిన తేజ ప‌క్క‌న శివాని క‌థానాయిక‌గా న‌టించ‌బోతుండ‌టం విశేషం. సుమంత్‌తో న‌రుడా డోన‌రుడా సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన మ‌ల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. తేజ‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్ర‌శాంత్ వ‌ర్మ (అ!, క‌ల్కి చిత్రాల ద‌ర్శ‌కుడు) ఈ సినిమాకు క‌థ అందించ‌డం విశేషం.

ఈ ప్రాజెక్టుకు ప్ర‌శాంత్ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. శేఖ‌ర్ రెడ్డి అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. అందాల రాక్ష‌సి, అర్జున్ రెడ్డి ఫేమ్ ర‌థ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. ఈ చిత్రానికి మొత్తంగా ఆస‌క్తిక‌ర‌మైన సెట‌ప్పే కుదిరిన‌ట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English