బిగ్ బాస్‌కు వ‌స్తానంటున్న నాని

బిగ్ బాస్‌కు వ‌స్తానంటున్న నాని

నేచుర‌ల్ స్టార్ నాని మొద‌ట్నుంచి అంద‌రివాడిలాగే ఉన్నాడు. అత‌డిని దాదాపుగా ఎవ‌రూ వ్య‌తిరేకించేవాళ్లు కాదు. అంద‌రు హీరోల అభిమానులూ ఓన్ చేసుకునేవారు. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు, యువ‌త‌కు అత‌ను బాగా చేరువ అయ్యాడు. కెరీర్లో అస‌లు నెగెటివిటీ అంటూ లేని అత‌ను.. గ‌త ఏడాది బిగ్ బాస్ షోతో తొలిసారిగా వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నాడు.

అందులో అత‌డి యాంక‌రింగ్ న‌చ్చ‌ని వాళ్లు కొంద‌రైతే, కౌశ‌ల్‌ను టార్గెట్ చేయ‌డం న‌చ్చ‌ని వాళ్లు ఇంకొంద‌రు. సోష‌ల్ మీడియాలో వీళ్లు నాని మీద చిన్న‌పాటి యుద్ధ‌మే చేశారు. కెరీర్లో ఎన్న‌డూ లేని విధంగా నెగెటివిటీ రుచి చూసిన నాని.. ఆ దెబ్బ‌తో బిగ్ బాస్‌కు దండం పెట్టేశాడు. ఇక‌పై మ‌ళ్లీ ఈ షోలో క‌నిపించ‌న‌నే సంకేతాలిస్తూ సెల‌వు తీసుకున్నాడు.

అలాంటిది ఇప్పుడు నాని మ‌ళ్లీ బిగ్ బాస్‌కు వ‌స్తానంటున్నాడు. అలాగ‌ని మ‌ళ్లీ హోస్ట్‌గానే అనుకుంటే పొర‌బాటే. త‌న కొత్త సినిమా గ్యాంగ్ లీడ‌ర్ ప్ర‌మోష‌న్ల కోసం బిగ్ బాస్‌లో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేయాల‌నుకుంటున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు. బిగ్ బాస్ షో చూస్తున్నారా అని అడిగితే.. త‌న‌కు అస్స‌లు ఖాళీ లేద‌ని చెప్పిన నాని.. త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం బిగ్ బాస్‌కు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు.

ప‌నిలో ప‌నిగా ఈ సీజ‌న్‌లో హోస్ట్‌గా నాగార్జున అద్భుతంగా చేస్తున్నాడ‌ని కితాబిచ్చాడు. కానీ నాని ఏదో మాట వ‌ర‌స‌కు ఆ మాట అన్న‌ట్లుంది త‌ప్పితే.. అత‌ను నిజంగానే బిగ్ బాస్‌కు వెళ్తాడా అన్న‌ది డౌటే. చూద్దాం మ‌రి. నిజంగా నాని మ‌ళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడ‌తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English