ప్ర‌భాస్ సాయాన్ని మ‌రిచి సెటైర్లా?

ప్ర‌భాస్ సాయాన్ని మ‌రిచి సెటైర్లా?

త‌మిళ ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో వ‌చ్చే ఆదాయం కావాలి. సూర్య, కార్తి లాంటి ఒక‌రిద్ద‌రిని మిన‌హాయిస్తే మ‌న వాళ్ల ప‌ట్ల వాళ్ల‌కు నిజ‌మైన ప్రేమ ఏమీ క‌నిపించ‌దు. సినిమాల రిలీజ్ టైంలో వ‌చ్చి తెలుగు వాళ్లు మంచోళ్లు అని పొగిడి సినిమాను ప్ర‌మోట్ చేసుకుని వెళ్తారు.

మ‌న‌కేదైనా క‌ష్టం వ‌స్తే ఆదుకోవ‌డానికి ముందుకు రారు. హుద్ హుద్ తుపాను స‌మ‌యంలో త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన ర‌జ‌నీకి ఈ ఉత్పాతం గురించి చెబితే.. తాను చెన్నైకి వెళ్లి విరాళం సంగ‌తి చూస్తాన‌న్నాడు. త‌ర్వాత కేవ‌లం 5 ల‌క్ష‌ల చిల్ల‌ర ప‌డేశాడు. తెలుగు మార్కెట్ నుంచి కోట్లు కొల్ల‌గొట్టే ర‌జ‌నీ మ‌న‌వాళ్ల‌కు చేసిన సాయ‌మిది. ఇక త‌మ సినిమానే గొప్ప అని.. తెలుగు సినిమాల్ని త‌మిళులు కించ‌ప‌రిచే తీరు గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

ఎప్పుడూ వాళ్ల సినిమాల్ని మ‌నం నెత్తిన పెట్టుకోవ‌డ‌మే కానీ.. మ‌న సినిమాల్ని త‌మిళులు ఆద‌రించ‌డం అరుదు. ఐతే బాహుబ‌లితో ఈ ఒర‌వ‌డిని మార్చాడు రాజ‌మౌళి. ఆ సినిమా త‌మిళంలో ఇర‌గాడేసింది. ఈ ఊపును కొన‌సాగిస్తూ ప్ర‌భాస్ కొత్త సినిమా సాహోను త‌మిళంలో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.

కానీ ఈ సినిమాను తొక్క‌డానికి ఎంత ప్ర‌య‌త్నం చేయాలో అంతా జ‌రిగింది. త‌మిళ మీడియా వాళ్లు అదే ప‌నిగా నెగెటివ్ ప్ర‌చారం చేశారు. ఇక ఈ సినిమా రిలీజ‌య్యాక త‌మిళ సెల‌బ్రెటీలు సైతం సెటైర్లు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వెంక‌ట్ ప్ర‌భు అనే ద‌ర్శ‌కుడు సాహోను ఎద్దేవా చేస్తూ ఓ ట్వీట్ వేశాడు.

సాహోకు పోటీగా వైభ‌వ్ సినిమా సిక్స‌ర్ రిలీజై పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. ఆ విష‌యం ప్ర‌స్తావిస్తూ ఇది సిక్స‌ర్ వీక్ అని పేర్కొంటూ SAHOdaran వైభ‌వ్‌కు శుభాకాంక్ష‌లు అన్నాడు వెంక‌ట్‌. ఇది ప్ర‌భాస్ అభిమానుల‌కు మంట పుట్టించింది. వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్లో సూర్య న‌టించిన రాక్ష‌సుడు సినిమా ఆడియో వేడుక‌కు ప్ర‌భాస్ వ‌చ్చి స‌పోర్ట్ చేయ‌డ‌మే కాక‌.. వెంక‌ట్ గురించి ఎంతో పాజిటివ్‌గా మాట్లాడిన విష‌యం గుర్తు చేసి అలా సాయం చేస్తే ఇలా సెటైర్ వేస్తావా అంటూ అత‌డిని తిట్టిపోస్తున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English