ప్ర‌భాస్ లుక్స్ విష‌యంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్

ప్ర‌భాస్ లుక్స్ విష‌యంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్

సాహో సినిమా మీద రూ.350 కోట్ల బ‌డ్జెట్ పెట్టార‌ట‌. అందులో ఒక్క యాక్ష‌న్ ఎపిసోడ్ కోస‌మే రూ.100 కోట్ల దాకా ఖ‌ర్చ‌యింద‌ట‌. సెట్టింగుల కోస‌మే ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర వంద కోట్ల దాకా అయింద‌ట‌. విడుద‌ల‌కు ముందు ఈ క‌బుర్లు విన‌డానికి చాలా బాగానే అనిపించాయి. కానీ తెర‌మీద చూస్తే అది 350 కోట్ల సినిమాలా ఎంత‌మాత్రం అనిపించ‌లేదు.

భారీత‌నం క‌నిపించింది కానీ.. ఈ ఖ‌ర్చుకు త‌గ్గ‌ట్ల‌యితే కాదు. అన్నిటికంటే మించి ఈ సినిమాకు అంత ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం ఉందా అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. రూ.100-150 కోట్ల‌లో సినిమా తీసినా పెద్ద తేడా ఏమీ ఉండేది కాదేమో. సినిమా మీద ఇంత ఖ‌ర్చు పెట్టి బేసిక్ విష‌యాలు కొన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ప్రేక్ష‌కుల‌కు అస‌హ‌నం క‌లిగించింది.

ఈ సినిమాకు ఇంత హైప్ రావ‌డానికి, అంత బిజినెస్ జ‌ర‌గ‌డానికి కార‌ణం ప్ర‌భాస్. అత‌ను ఈ సినిమాకు క‌వ‌ర్ పేజీ లాంటి వాడు. కానీ ఆ క‌వ‌ర్ పేజీ పాలిపోయిన‌ట్లు క‌నిపించ‌డం అభిమానుల‌కు రుచించ‌లేదు. బాహుబ‌లిలో.. అంత‌కంటే ముందు మిర్చిలా ప్ర‌భాస్ ఎంత అందంగా క‌నిపించాడో తెలిసిందే. రాజ‌మౌళి, కొర‌టాల శివ ప్ర‌భాస్‌ను కెరీర్లోనే ది బెస్ట్ అనిపించే లుక్స్‌లో చూపించారు.

మిర్చి నాటికి ప్ర‌భాస్ వ‌య‌సు త‌క్కువ కాబ‌ట్టి.. సాహో లాంటి రెగ్యుల‌ర్ మూవీలో అంతే అందంగా క‌నిపించాల‌ని ఆశించ‌డం త‌ప్పే అవుతుంది. కానీ సినిమాలో అత‌డి లుక్ మ‌రీ పేల‌వంగా క‌నిపించింది. మేక‌ప్, స్టైలింగ్ విష‌యంలో మినిమం కేర్ లేద‌నిపించింది. త్వ‌ర‌గా ఈ సీన్ అయిపోయి.. ప్ర‌భాస్ వేరే లుక్‌లో క‌నిపిస్తే బాగుండే అని ఫీలింగ్ ఇచ్చిన స‌న్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి.

ప్ర‌భాస్ లుక్స్ విష‌యంలో పూర్తిగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది సాహోకు. క‌నీసం త‌న త‌ర్వాతి సినిమా విష‌యంలో అయినా అత‌ను జాగ్ర‌త్త ప‌డాలి. పైగా అది ప్రేమ‌క‌థ అంటున్నారు కాబ‌ట్టి లుక్స్ బాగుండ‌టం చాలా అవ‌స‌రం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English