ఇలా హ్యాండివ్వ‌డం ర‌వితేజ‌కు ఇది కొత్తా ఏంటి?

ఇలా హ్యాండివ్వ‌డం ర‌వితేజ‌కు ఇది కొత్తా ఏంటి?

మాస్ రాజా ర‌వితేజ మ‌రోసారి ప్ర‌తికూల విష‌యాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తితో సినిమా ఓకే చేసిన‌ట్లే చేసి అత‌డికి హ్యాండ్ ఇవ్వ‌డంతో.. అత‌డికి మండిపోయి మాస్ రాజాను ఉద్దేశించే చీప్ స్టార్ అనే కామెంట్ చేసిన‌ట్లుగా భావిస్తున్నారు. ర‌వితేజ‌-సిద్దార్థ్-కాజ‌ల్ కాంబినేష‌న్లో మ‌హాస‌ముద్రం అనే సినిమా తీయాల‌ని అనుకున్నాడు అజ‌య్.

జెమిని కిర‌ణ్ ఈ సినిమాను నిర్మించ‌డానికి ముందుకొచ్చాడు. ఇక సినిమా ప‌ట్టాలెక్క‌డ‌మే త‌రువాయి అనుకుంటుండ‌గా ర‌వితేజ వెన‌క్కి త‌గ్గాడు. అజ‌య్‌కు మండిపోయింది. ఐతే అంతా ఓకే అనుకున్నాక ఇలా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ర‌వితేజ హ్యాండివ్వ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలోనూ కొంద‌రికి ఈ చేదు అనుభ‌వాలున్నాయి.

రెండేళ్ల కింద‌ట ల‌క్ష్మ‌ణ‌న్ అనే త‌మిళ ద‌ర్శ‌కుడు తాను తీసిన బోగ‌న్ చిత్రాన్ని ర‌వితేజ‌తో తెలుగులో రీమేక్ చేయాల‌ని వ‌చ్చాడు. కొన్ని నెల‌ల పాటు క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయి. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా స్క్రిప్టులో మార్పులు కూడా జ‌రిగాయి. నిర్మాత కూడా సెట్ అయ్యాడు. ఐతే ఆరు నెల‌ల పాటు ఆ ద‌ర్శ‌కుడిని త‌న చుట్టూ తిప్పించుకుని చివ‌రికి ఆ సినిమా చేయ‌న‌నేశాడు. ల‌క్ష్మ‌ణ‌న్ చెన్నైకి వెళ్లి అక్క‌డి మీడియా ద‌గ్గర ర‌వితేజ‌ను తిట్టిపోశాడు.

ఇక తాను ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన బాబీ.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఇబ్బంది పెడుతుంటే.. అత‌డ‌డితో క్రాక్ అనే సినిమా చేయ‌డానికి రెడీ అయిన ర‌వితేజ అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాను కూడా ప‌క్క‌న పెట్టేశాడు. అంత‌కుముందు వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్లో ఓ సినిమా అనుకుని.. ప్రారంభోత్స‌వానికి కూడా హాజ‌ర‌య్యాడు మాస్ రాజా. కానీ పారితోష‌కం ద‌గ్గ‌ర పేచీ త‌లెత్తి ఆ సినిమా నుంచి కూడా బ‌య‌టికి వ‌చ్చేయ‌డం తెలిసింది. దీని వ‌ల్ల వేణు చాలా డిస్ట‌ర్బ్ అయ్యాడు పాపం. ఇలాంటి మ‌రికొన్ని ఉదంతాలు మాస్ రాజా కెరీర్లో ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English