దేవ‌ర‌కొండ కొత్త సినిమా.. ఎందుకీ సైలెన్స్?

దేవ‌ర‌కొండ కొత్త సినిమా.. ఎందుకీ సైలెన్స్?

విజ‌య్ దేవ‌ర‌కొండకు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్టు కావాలి. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న డియ‌ర్ కామ్రేడ్ అత‌డికి చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. ఇక అత‌డి ఆశ‌ల‌న్నీ క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా మీదే ఉన్నాయి. ఐతే ఈ సినిమా విష‌యంలో చిత్ర బందం ముందు నుంచి గోప్య‌త పాటిస్తుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం.

సినిమా మొద‌లు కావ‌డానికి ముందే టైటిల్, మేకింగ్ ఆరంభ ద‌శ‌లోనే ఫ‌స్ట్ లుక్, మ‌ధ్య‌లో టీజ‌ర్ లాంటివి రిలీజ్ చేయ‌డం ఇప్ప‌డు ఆన‌వాయితీగా వ‌స్తోంది. సినిమా ప‌ట్టాలెక్కే ద‌శ నుంచి ప్ర‌చారం చేస్తే త‌ప్ప జ‌నాల్లోకి సినిమా వెళ్ల‌డం క‌ష్ట‌మైపోతోంది ఈ రోజుల్లో. కానీ విజ‌య్-క్రాంతి మాధ‌వ్ సినిమా విష‌యంలో ఇలాంటి విశేషాలేమీ క‌నిపించ‌డం లేదు.

ఈ సినిమా షూటింగ్ ఆరంభ‌మై ఏడెనిమిది నెల‌ల‌వుతోంది. డియర్ కామ్రేడ్ మొద‌లైన కొన్ని నెల‌ల‌కే ఈ చిత్ర షూటింగ్ కూడా ఆరంభించాడు. రెండు సినిమాల్లో స‌మాంత‌రంగా న‌టిస్తూ వ‌చ్చాడు విజ‌య్. కానీ ఇప్ప‌టిదాకా ఈ చిత్ర టైటిల్ కూడా ప్ర‌క‌టించ‌లేదు. షూటింగ్ అప్ డేట్స్ కూడా ఏమీ లేవు. షూటింగ్ సుదీర్ఘంగా సాగుతోంది. ప్ర‌మోష‌న్ హ‌డావుడి కూడా ఏమీ లేదు. త‌న సినిమాను మొద‌ట్నుంచి వెరైటీగా ప్ర‌మోట్ చేయ‌డం అల‌వాటైన విజ‌య్.. ఈ చిత్రం విష‌యంలో మాత్రం అలాంటిదేమీ చేయ‌ట్లేదు.

క‌నీసం టైటిల్ ప్ర‌క‌టించి, ఫ‌స్ట్ లుక్ అయినా వ‌దిలితే జ‌నాల్లో ఈ సినిమా గురించి కాస్త చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి అదేమీ చేయ‌కుండా ఇంత సుదీర్ఘ కాలం షూటింగ్ ద‌శ‌లోనే ఉండ‌ట‌మేంటో అర్థం కావ‌డం లేదు. సినిమా పూర్త‌య్యాక ఒకేసారి హంగామా మొద‌లుపెట్టి అగ్రెసివ్‌గా ప్ర‌మోట్ చేయాల‌న్న ప్ర‌ణాళిక‌లో విజ‌య్ ఉన్నాడో ఏమో మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English