త్రివిక్రమ్‌ను పొగిడిన‌ట్లే పొగిడి పంచ్

త్రివిక్రమ్‌ను పొగిడిన‌ట్లే పొగిడి పంచ్

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ బెస్ట్ మూవీస్ ఏవ‌ని సోష‌ల్ మీడియాలో ఎప్పుడు పోల్ లాంటిది పెట్టినా.. ఖ‌లేజా టాప్‌లో క‌నిపిస్తుంది. ఆయ‌న హిట్ సినిమాల్ని మించి దీనికి ఎక్కువ ఓట్లు ప‌డుతుంటాయి. ఈ చిత్రం టీవీల్లో వ‌స్తే ఛానెల్ మార్చకుండా దానికి అతుక్కుపోతుంటారు జ‌నాలు. యూట్యూబ్‌లో కూడా దీనికి భారీగా వ్యూస్ ఉన్నాయి.

కానీ ఆ చిత్రం థియేట‌ర్ల‌లో ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. అది డిజాస్ట‌ర్ అయింది. ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ స‌హా చాలామంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. తాజాగా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సైతం ఈ సినిమా ఫ‌లితం ప‌ట్ల త‌న అసంతృప్తిని ప్ర‌క‌టించాడు. మంచి విష‌యం ఉండి కూడా థియేట‌ర్ల‌లో స‌రిగా ఆడ‌ని కొన్ని సినిమాల గురించి అత‌ను తాజాగా ట్వీట్ వేశాడు.

అందులో ఖ‌లేజాతో పాటు లీడ‌ర్, పంజా, ఆరెంజ్, అందాల రాక్ష‌సి చిత్రాల‌తో పాటు ఒక‌ప్ప‌టి ఆప‌ద్బాంధ‌వుడు, ఇప్ప‌టి డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్ని కూడా అత‌ను ప్ర‌స్తావించాడు. ఈ సినిమాలు బాగా ఆడి ఉంటే టాలీవుడ్ గ‌మ‌న‌మే మారిపోయి ఉండేద‌ని అశ్విన్ అన్నాడు. ఇక ఖ‌లేజా గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. ఆ సినిమా బాగా ఆడి ఉంటే త్రివిక్ర‌మ్ రైటింగ్ స్థాయే వేరుగా ఉండేద‌ని అభిప్రాయ‌పడ్డాడు.

ఇక్క‌డ ఖ‌లేజా విష‌యంలో త్రివిక్రమ్‌ను పొగ‌డ్డంతో పాటు ఆ సినిమా త‌ర్వాత ఆయ‌న రైటింగ్ స్థాయికి త‌గ్గ‌ట్లుగా లేద‌న్న విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన‌ట్ల‌యింది. అశ్విన్ మాట‌ల్లో నిజం లేక‌పోలేదు. ఒక‌ప్పుడు త్రివిక్ర‌మ్ రాత స్థాయే వేరుగా ఉండేది. కొన్నేళ్లుగా ఆయ‌న ప్యాకేజీ సినిమాలే అందిస్తున్నాడు. వాటిలో హిట్లు ఉండొచ్చు కానీ.. ఆయ‌న స్థాయి త‌గ్గిపోయింద‌న్న‌ది వాస్త‌వం. ర‌చ‌యిత‌గా ఉన్నపుడు, ద‌ర్శ‌కుడిగా తొలి నాళ్ల‌లో మాదిరి ఆయ‌న క‌థ‌ల్లో ఆత్మ ఉండట్లేద‌న్న విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తునే వ‌చ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English