రోబోనే న‌యం.. సైరా చాలా క‌ష్టం

రోబోనే న‌యం.. సైరా చాలా క‌ష్టం

ద‌క్షిణాదిన మంచి స్థాయి ఉన్న సినిమాటోగ్రాఫ‌ర్ల‌లో ర‌త్న‌వేలు ఒక‌డు. శంక‌ర్ విజువ‌ల్ వండ‌ర్ రోబోకు ఛాయాగ్ర‌హ‌ణం అందించింది అత‌నే. ఈ చిత్రం కంటే ముందు చిన్న‌, మీడియం రేంజి సినిమాలు చేసుకుంటున్న ర‌త్న‌వేలును తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశాడు సుకుమార్. ఆర్య ద‌గ్గ‌ర్నుంచి వీరి ప్ర‌యాణం సాగుతోంది. వీరి క‌ల‌యిక‌లో రంగ‌స్థ‌లం లాంటి అద్భుత చిత్రం వ‌చ్చింది.

1 నేనొక్క‌డినే ఆడ‌క‌పోయి ఉండొచ్చు కానీ.. ఆ చిత్రంలోనూ ర‌త్న‌వేలు ప్ర‌తిభ క‌నిపిస్తుంది. రోబో గురించైతే చెప్పాల్సిన ప‌ని లేదు. కెమెరాతో అద్భుతాలు చేశాడు. ఆ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డిందో గ‌తంలో కొన్నిసార్లు చెప్ప‌కొచ్చాడు ర‌త్న‌వేలు. ఐతే తాను ఇటీవ‌లే పూర్తి చేసిన సైరా చిత్రంతో పోలిస్తే.. రోబోకు ప‌డ్డ క‌ష్టం త‌క్కువే అంటున్నాడ‌త‌ను.

త‌న కెరీర్ మొత్తంలో అత్యంత శ్ర‌మకు గుర‌య్యేలా చేసిన సినిమా సైరానే అని చెప్పాడు ఓ ఇంట‌ర్వ్యూలో ర‌త్న‌వేలు. ఏకంగా 220 రోజుల పాటు ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగిన‌ట్లు ర‌త్న‌వేలు వెల్ల‌డించాడు. రోబో సినిమాలో ఎక్కువ‌గా విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాయాజాలం ఉంటుంద‌ని.. కానీ సైరాను భారీ లొకేష‌న్ల‌లో వేల‌మందిని కోఆర్డినేట్ చేసుకుంటూ చిత్రీక‌ర‌ణ సాగించాల్సి వ‌చ్చింద‌ని.. ఈ క్ర‌మంలో ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

ఫారిన్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు ఈ సినిమాకు ప‌ని చేశార‌ని.. వాళ్లంతా భారీగా పారితోష‌కాలు తీసుకున్నార‌ని.. వారి కాల్ షీట్లు వృథా కాకుండా అన్నీ సిద్ధం చేసి చిత్రీక‌ర‌ణ సాగించ‌డం పెద్ద టాస్క్‌గా మారింద‌ని చెప్పాడు ర‌త్న‌వేలు. ఒక భారీ స‌న్నివేశం కోసం ఫారిన్లో అంతా సిద్ధం చేసుకున్నాక రాత్రి వ‌ర్షం ప‌డి అంతా వృథా అయింద‌ని.. కొన్నిసార్లు అంతా రెడీ అయ్యాక స‌మ‌యానికి సెట్‌కు గుర్రాలు వ‌చ్చేవి కాద‌ని.. ఇలాంటి ఎన్నో ఇబ్బందుల్ని త‌ట్టుకుంటూ స‌హ‌నం కోల్పోకుండా షూటింగ్ పూర్తి చేశామ‌ని.. ఎంత క‌ష్ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ ఇలాంటి గొప్ప సినిమాకు ప‌ని చేయ‌డం గొప్ప అనుభ‌వ‌మ‌ని చెప్పాడు ర‌త్న‌వేలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English