' సాహో ' చిన్న సినిమాల‌కు కూడా లైట్ అయ్యిందా...

' సాహో ' చిన్న సినిమాల‌కు కూడా లైట్ అయ్యిందా...

సాధారణంగా ఓ పెద్ద సినిమా థియేటర్లలో ఉందంటే క‌నీసం రెండు వారాల పాటు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ఎవ్వ‌రూ సాహ‌సించ‌రు. బాహుబ‌లి, సాహో, సైరా లాంటి సినిమాలు వ‌స్తున్నాయంటే ముందునుంచే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాలు వ‌చ్చాక క‌నీసం రెండు వారాల పాటు త‌మ సినిమాలు రిలీజ్ చేయ‌కూడ‌ద‌నే ఎవ‌రైనా అనుకుంటారు. ఇక ఇప్పుడు సాహో థియేట‌ర్ల‌లో ఉంది. ఈ సినిమాకు వ‌చ్చిన హైప్ చూస్తే రెండు వారాల ర‌న్ త‌ర్వాత ఇత‌ర సినిమాలు థియేట‌ర్ల‌లోకి దింపాల‌ని అనుకుంటారు.

అయితే సాహో విష‌యంలో ఎవ్వ‌రూ జ‌డ‌వ‌డం లేదు. ఈ సినిమా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతున్నా అంద‌రూ లైట్ తీస్కొంటున్నారు. ఈ వీకెండ్ ఇతర సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7 సినిమాలు క్యూ కట్టాయి. ఆది సాయికుమార్ - శ్ర‌ద్ధా శ్రీనాథ్ జోడీపై కాస్త అంచ‌నాలు ఉన్నాయి. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న ఈ సినిమాపై ఆది చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. సాహో ఉన్నప్పటికీ ఉన్నంతలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే దీనికి థియేటర్లు దొరికాయి.

జోడీతో పాటు ఉండిపోరాడే - ద‌ర్ప‌ణం - 2 అవర్స్ లవ్ - నీ కోసం అంటూ మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవ‌న్నీ చిన్న సినిమాలే వీటి గురించి మాట్లాడుకోవాల్సినంత సీన్ కూడా లేదు. అయితే వీటిల్లో ఏదైనా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేస్తే అది రికార్డు అవుతుంది. వీటితో పాటు  వీడే సరైనోడు, తారామణి అనే 2 డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీడే సరైనోడు సినిమాలో నయనతార ఉంది. తారామణి సినిమాలో ఆండ్రియా, అంజలి ఉన్నారు.. వీళ్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తే ఏవైనా మంచి ఓపెనింగ్స్ రావొచ్చు.

ఏదేమైనా సాహోకు నెగిటివ్ టాక్ రావ‌డంతో థియేట‌ర్ల కూడా ఖాళీ అవుతున్నాయి. చాలా సెంట‌ర్ల‌లో సింగిల్‌, డ‌బుల్ థియేట‌ర్లు ఉంచి మిగిలిన‌వి ఖాళీ చేస్తుండ‌డంతో చిన్న సినిమాలు సాహో ఉంద‌న్న విష‌య‌మే మ‌ర్చిపోయి త‌మ సినిమాలు వ‌దులుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English