వాల్మీకి త‌ర్వాత మ‌ళ్లీ రీమేకేనా?

వాల్మీకి త‌ర్వాత మ‌ళ్లీ రీమేకేనా?

రీమేక్ స్పెష‌లిస్టుగా పేరు తెచ్చుకోవడానికి ఏ ద‌ర్శ‌కుడూ ఇష్ట‌ప‌డ‌డు. రీమేక్‌లో ఎంత టాలెంట్ చూపించినా.. ఎన్ని మార్పులు చేసినా.. ఎంత పెద్ద హిట్టు కొట్టినా స‌రైన గుర్తింపు రాదు. సినిమా హిట్ట‌యితే మాతృకదే ఆ ఘ‌న‌త అంటారు. ఫ్లాప్ అయితే ఒరిజిన‌ల్‌ను చెడ‌గొట్టాడంటారు. అందుకే ఆస్త పేరున్న ద‌ర్శ‌కులు రీమేక్ చేయ‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు.

అయితే స్టార్ హ‌రీష్ శంక‌ర్ మాత్రం ఒక‌టికి రెండు రీమేక్‌ల‌ను డైరెక్ట్ చేశాడు. ఇంత‌కుముందు హిందీ చిత్రం ద‌బంగ్‌ను గ‌బ్బర్ సింగ్‌గా మ‌లిచిన హ‌రీష్‌.. తాజాగా త‌మిళ హిట్ జిగ‌ర్ తండ‌ను వాల్మీకిగా తీర్చిదిద్దాడు. రెండు సినిమాల్లోనూ మార్పులు చేర్పులు చేసి త‌న‌దైన ముద్ర చూపించే ప్ర‌య‌త్నం చేశాడు హ‌రీష్‌.

ఐతే వాల్మీకితో హిట్టు కొట్టి త‌న సొంత క‌థ‌తో పెద్ద హీరో ఎవ‌రితో అయినా సినిమా చేయాల‌ని ఆశ ప‌డుతుంటే.. మ‌ళ్లీ అత‌డిని ఇంకో రీమేక్‌కు కమిట్ చేయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. యువ క‌థానాయ‌కుడు నితిన్ హిందీ సెన్సేష‌ల‌న్ హిట్ అంద‌దున్ రీమేక్‌లో న‌టించ‌డానికి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.4 కోట్ల‌కు తెలుగు రీమేక్ హ‌క్కుల్ని నితినే ద‌క్కించుకున్నాడు. అంత ఖ‌ర్చు పెట్టి తీసుకున్న సినిమాను మంచి ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టాల‌ని చూస్తున్నాడు. కాపీ పేస్ట్ వ్య‌వ‌హారంలా కాకుండా రీమేక్‌లోనూ త‌న‌దైన శైలి చూపించే హ‌రీష్ అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నాడ‌ట‌.

హ‌రీష్‌కు ఈ సినిమా బాగానే సూట్ కావ‌చ్చు కూడా. కానీ వ‌రుస‌గా ఇంకో రీమేక్ తీస్తే ఇక హ‌రీష్‌పై రీమేక్ డైరెక్ట‌ర్ అనే ముద్ర ప‌డిపోతుంది. అత‌డి సొంత క‌థ‌ల్ని న‌మ్మ‌డం మానేస్తారు. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English