కాపీ ఆరోప‌ణ‌ల‌పై సాహో ద‌ర్శ‌కుడి స‌మాధాన‌మిది

కాపీ ఆరోప‌ణ‌ల‌పై సాహో ద‌ర్శ‌కుడి స‌మాధాన‌మిది

పోయినేడాది అజ్నాత‌వాసి సినిమా రిలీజైన‌పుడు అది లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమాకు కాపీ అంటూ ఎంత ర‌గ‌డ జ‌రిగిందో తెలిసిందే. ఈ రెండు సినిమాలు చూసిన వాళ్లు అది నిజ‌మే అనే అన్నారు. స్వ‌యంగా లార్గోవించ్ ద‌ర్శ‌కుడు జెరోమ్ సాలె.. అజ్నాత‌వాసి చూసి త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశాడు.

ఇప్పుడు సాహో సినిమా సైతం లార్గోవించ్ స్ఫూర్తితో తెర‌కెక్కిందే అన్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అజ్నాత‌వాసితో ఈ చిత్రానికి పోలిక‌లు గ‌మ‌నించ‌వ‌చ్చు. లార్గోవించ్ ద‌ర్శ‌కుడికి ప‌నేమీ లేదో ఏమో కానీ అత‌ను సాహో సినిమాను కూడా చూశాడు. త‌న‌కు ఇండియాలో మంచి కెరీర్ ఉందంటూ సెటైర్ కూడా వేశాడు.

ఐతే సాహో.. లార్గో వించ్‌కు కాపీ అనే ఆరోప‌ణ‌ల్ని ద‌ర్శ‌కుడు సుజీత్ ముందు పెడితే మాత్రం అత‌ను అస‌హ‌నానికి గుర‌య్యాడు. ఈ ఆరోప‌ణ‌ల్ని ఖండించాడు. లార్గో వించ్‌కు సాహో అంటున్న‌వాళ్లు ఆ సినిమా చూసి ఉండ‌ర‌ని.. నిజానికి తాను కూడా ఆ ఫ్రెంచ్ మూవీని చూడ‌లేద‌ని సుజీత్ అన్నాడు.

ద‌ర్శ‌కుడిగా త‌న తొలి సినిమా ర‌న్ రాజా ర‌న్‌నే కొంచెం మార్చి సాహోగా తీశాన‌ని.. నాన్న చ‌నిపోతే ఎక్క‌డో బ‌తుకుతున్న హీరో వ‌చ్చి.. తాను ఆ తండ్రి కొడుకున‌ని నిరూపించుకోవ‌డం లార్గోవించ్ క‌థ అని.. దానికి సాహోకు సంబంధం లేద‌ని.. అయినా హీరో తండ్రి చ‌నిపోయిన క‌థ‌ల‌న్నీ లార్గోవించ్ కాపీలే అంటే ఎలా అని ప్ర‌శ్నించాడు సుజీత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English