య‌న్.టి.ఆర్ ఎందుకు పోయిందో చెప్పిన నిర్మాత‌

య‌న్.టి.ఆర్ ఎందుకు పోయిందో చెప్పిన నిర్మాత‌

సీనియ‌ర్ ఎన్టీఆర్ మీద సినిమా తీయ‌డం మంచిది కాద‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న జీవితంలో చాలా వివాదాస్ప‌ద‌మైన‌, బాధాక‌ర‌మైన ఘ‌ట్టాలున్నాయి. ఉన్న‌దున్న‌ట్లు తీస్తే డ్రామాకు మంచి అవ‌కాశ‌మే ఉంటుంది. మ‌హాన‌టి లాగా ఎన్టీఆర్ సినిమా కూడా మెప్పు పొంద‌డానికి అవ‌కాశ‌ముంది. కానీ అవ‌న్నీ చూపించే సాహ‌సం నంద‌మూరి బాల‌కృష్ణ చేయ‌లేడ‌ని అంద‌రికీ తెలుసు.

బాల‌య్య సినిమా త‌ల‌పెడితే అది ఏక‌ప‌క్షంగా ఉంటుంద‌న్న సందేహాల‌తోనే చాలామంది వ‌ద్ద‌ని వారించారు. కానీ ఆయ‌న విన‌లేదు. చివ‌రికి సినిమా ఫ‌లితం ఏమైందో తెలిసిందే. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. నిజానికి ఈ సినిమా తీయాల‌ని మొదట ఆలోచించింది బాల‌య్య కాద‌ట‌. విష్ణు ఇందూరిన‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అత‌నే వెల్ల‌డించాడు.

ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి ఫ‌లితం వ‌చ్చినా.. ఆ చిత్రం చేసినందుకు తాను గ‌ర్విస్తాన‌ని విష్ణు చెప్ప‌డం విశేషం. తాము మేకింగ్ టైంలో తాము చేసిన పెద్ద పొర‌బాటు వ‌ల్ల చేదు అనుభ‌వం ఎదుర్కొన్నామ‌ని.. ఇదొక ఖ‌రైదీన గుణ‌పాఠ‌మ‌ని చెప్పాడు విష్ణు. ప్రేక్షకులు ఆశించిన ఏదో ఒక‌ కీ పాయింట్ తాము మిస్సయ్యామనిపించిందని.. మహాభారతం, గాంధీ జీవిత గాథ లాంటి వాటినే ఒక భాగంలో చెప్ప‌గ‌లిగిన‌పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను కూడా తాము ఒక పార్ట్‌లో చెప్పి ఉండాల్సింద‌ని.. ఇక్క‌డే పెద్ద త‌ప్పు చేశామ‌నిపిస్తోంద‌ని విష్ణు తెలిపాడు.

య‌న్.టి.ఆర్ సినిమా ఒక భాగంగా వచ్చినట్లైతే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేదేమో అని విష్ణు తెలిపాడు. ఈ సినిమా నుంచి పాఠం నేర్చుకుని త‌ర్వాతి చిత్రాల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు విష్ణు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English