హైడింగ్‌లోకి వెళ్లిన ఇలియానా

హైడింగ్‌లోకి వెళ్లిన ఇలియానా

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ చేసుకున్న ఇలియానా తిరిగి సినిమాలతో బిజీ కావాలని చూస్తోంది. ఆమధ్య పెళ్లి చేసుకుంటాననే నమ్మకంతో ఇక ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం మానేసిన ఇలియానా తిరిగి పూర్వ రూపం సంతరించుకునే పనిలో పడింది.

ఇప్పుడు తాను ఎలా వుందనేది కనిపించనివ్వకుండా పాత ఫోటోలని పోస్ట్‌ చేస్తోంది. ఆమె పాత ఫోటోలు పెడుతోంటే మీడియా కన్‌ఫ్యూజ్‌ అయి ఇప్పుడు మళ్లీ ఇలా అయిందంటూ కితాబులు ఇవ్వడం స్టార్ట్‌ చేసింది. అయితే ఇలియానా తన మేకోవర్‌ పూర్తయ్యేవరకు అసలు రూపాన్ని చూపించరాదని డిసైడ్‌ అయింది.

ఒక్కసారి మునుపటి రూపం సంతరించుకున్నాక అప్పుడే అవకాశాల కోసం వేట మొదలు పెడుతుందట. హిందీలో ఛాన్స్‌లు తగ్గిన తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి స్టెప్పే రాంగ్‌గా వేసింది.

అమర్‌ అక్బర్‌ ఆంటోని లాంటి డిజాస్టర్‌లో నటించడం, అందులోను షేపవుట్‌ అయి కనిపించడం ఆమెకి మైనస్‌ అయింది. ఇంతలోనే బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ కూడా అవడంతో ఇలియానా దానినుంచి రికవర్‌ అయి కెరియర్‌ పునరుద్ధరించుకునే పనిలో పడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English