అల వైకుంఠపురములో... నాన్నారింటికి దారేది!

అల వైకుంఠపురములో... నాన్నారింటికి దారేది!

త్రివిక్రమ్‌ చిత్రాలలో హీరో లేదా హీరోయిన్‌ విడిపోయిన రెండు కుటుంబాలని కలపడానికి రావడమనే కాన్సెప్ట్‌ కామన్‌గా కనిపిస్తుంది. అల్లు అర్జున్‌తో తీస్తోన్న 'అల వైకుంఠపురములో' కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే రూపొందుతోందట.

ఈసారి రెండు కుటుంబాల మధ్య విబేధాల కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమయిన కొడుకు పెద్దయ్యాక తన ఇంటికి పని వాడిగా వెళ్లి ఎలా వారికి దగ్గరయి, తనని పెంచిన వారినీ, కన్నవారినీ ఎలా ఒక్కటి చేసాడనేది కథ అట.

ఒక ధనవంతుల కుటుంబం, పేద కుటుంబం మధ్య విబేధాలు రాగా, ఇద్దరు తండ్రులు తమ కొడుకులని పుట్టినప్పుడే మార్చుకుని పెంచుతారు. అలా ధనవంతుడైనా కానీ పేదవాడిగా పెరిగిన హీరో ఎలాంటి లక్షణాలని పుణికి పుచ్చుకున్నాడు, పేదవాడైనా ధనవంతుడిగా పెరిగిన పిల్లాడు (సుషాంత్‌) ఎలా తయారయ్యాడు అనేది బేసిక్‌ స్టోరీ లైన్‌ అని తెలిసింది.

దీనికి త్రివిక్రమ్‌ మార్కు పాత్రలు, హాస్యం, భావోద్వేగాలు జత కలిసి మరో సకుటుంబ కథా చిత్రంగా రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ అసలు తల్లిగా టబు నటిస్తోంది. హీరోయిన్‌గా పూజ హెగ్డే, హీరోని కన్నతండ్రిగా జయరామ్‌, పెంచిన తండ్రిగా మురళిశర్మ నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ ఇందులో లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ గెటప్‌తో పాటు ధనికుడిగా కూడా కనిపించబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English