చరణ్‌కి హీరోయిన్‌ కాదు, గెస్ట్‌ రోల్‌ అంతే!

చరణ్‌కి హీరోయిన్‌ కాదు, గెస్ట్‌ రోల్‌ అంతే!

ఇద్దరు టాప్‌ హీరోలతో మల్టీస్టారర్‌ తలపెట్టిన రాజమౌళి ఇంతవరకు 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ అనుకున్నట్టు పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌ గాడిన పడ్డట్టు అనిపిస్తోంది. ఇందులో చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెపై ఇంతవరకు సీన్లే తీయకపోవడంతో ఆలియా భట్‌ పాత్ర ఎంత అనే అనుమానం మొదలయింది. ఈ చిత్రంలో ఆలియా భట్‌కి ఎక్కువ స్క్రీన్‌ టైమ్‌ వుండదట. కేవలం కొన్ని సీన్లు, ఒక పాటలో మాత్రమే ఆమె కనిపిస్తుందట. ఆమెది స్పెషల్‌ అప్పియరెన్స్‌లా అనిపిస్తుందని, హీరోయిన్‌ అనడానికి లేదని చెబుతున్నారు.

ఆ మాటకి వస్తే ఇందులో ఫిమేల్‌ క్యారెక్టర్స్‌కి తగినంత ప్రాధాన్యత వుండదని, పూర్తిగా హీరో సెంట్రిక్‌గా జరుగుతుందని తెలిసింది. చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరికీ విడివిడిగా పలు పోరాట దృశ్యాలు వుంటాయి. అలాగే ఇద్దరూ కలిసి కూడా కొన్ని ఫైట్‌ సీన్లు చేస్తున్నారు. సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువ కనుక, ముందుగా దానిని పూర్తి చేసే పనిలో రాజమౌళి బిజీగా వున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువ కనుక, ముందుగా ఆ ఫుటేజ్‌ షూట్‌ చేసి విఎఫ్‌ఎక్స్‌ టీమ్‌కి ఇచ్చేయాలని రాజమౌళి ఇలా డిసైడ్‌ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English