మహేష్‌తో దిల్‌ రాజు అన్‌హ్యాపీ!

మహేష్‌తో దిల్‌ రాజు అన్‌హ్యాపీ!

మహేష్‌బాబుతో వరుసగా రెండవ చిత్రం తీస్తోన్న దిల్‌ రాజు 'సరిలేరు నీకెవ్వరు'కి కూడా బిజినెస్‌ వ్యవహారాలు అన్నీ తానే చూసుకుంటున్నాడు. మహర్షికి ముగ్గురు నిర్మాతలున్నప్పటికీ దిల్‌ రాజుకే బిజినెస్‌ వ్యవహారాలు అప్పగించారు. ఈసారి కూడా సంయుక్త నిర్మాణమే అయినా కానీ దిల్‌ రాజు చేతుల మీదుగానే అమ్మకాలు, పంపకాలు జరుగుతున్నాయి. అయితే నిర్మాతల మాట వదిలేసి ఈ చిత్రానికి నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ అన్నీ రాయించేసుకున్న మహేష్‌ పట్ల దిల్‌ రాజు చాలా అసంతృప్తిగా వున్నాడనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఎంత పార్టనర్‌షిప్‌ డీల్‌ అయినా కానీ, తన బ్రాండింగ్‌కి ఏకంగా యాభై కోట్లు తీసేసుకోవాలని అనుకోవడం దిల్‌ రాజుకి నచ్చడం లేదట. మహర్షి చిత్రానికి నిర్మాతలకి ఎలాంటి లాభం రాకపోయినా కానీ ఈ చిత్రంతో అయినా దిల్‌ రాజుకి కాంపన్సేట్‌ చేయడానికి మహేష్‌ ట్రై చేయడం లేదట.

అలాగే నిర్మాణ వ్యయం యాభై కోట్లు మించి కాకుండా చూసుకోవాలని మాట అనుకున్నా కానీ ప్రతిదానికీ సెట్స్‌ వేయిస్తూ నిర్మాణ వ్యయం పెరగడానికి మహేష్‌ కారణం అవుతున్నాడని, ఇక నిర్మాతలుగా తనకీ, అనిల్‌ సుంకరకి దీంతో మిగిలేది ఏమిటని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. ఇక మీదట తన సినిమాలకి దిల్‌ రాజు భాగస్వామ్యం వుండాలని మహేష్‌ భావిస్తున్నా కానీ ఇది లాభసాటి వ్యవహారం కాదని దిల్‌ రాజు డీలా పడిపోయాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English