సాహో సౌధం కూలిపోయినట్టే!

సాహో సౌధం కూలిపోయినట్టే!

హిందీ మార్కెట్‌లో వచ్చిన వసూళ్లతో సాహో నిర్మాతలకి భారీ స్థాయిలో గ్రాస్‌ వసూళ్లు వేసుకునే వీలు చిక్కింది. హిందీ సూపర్‌స్టార్ల సినిమాలతో సమానంగా, బాహుబలి 2 కంటే తక్కువగా 'సాహో' చిత్రానికి తొలి వారాంతంలో మంచి వసూళ్లు రావడంతో త్వరగా వంద కోట్ల నెట్‌ వసూళ్లు వచ్చేసాయి. దీంతో గ్రాస్‌ ఫిగర్‌ భారీగా కనిపించింది. తెలుగు రాష్ట్రాలలో నిర్మాతలు స్వయంగా విడుదల చేసుకున్న ఏరియాలలో తోచిన నంబర్లు వేసుకుని తమ సినిమా బ్రహ్మాండంగా ఆడేస్తోందని, నెగెటివ్‌ టాక్‌ ప్రభావమే లేదని, ముఖ్యంగా జనాలకి నచ్చేస్తోందనే భ్రమ కలిగించడానికి చూసారు. కానీ సాహో అసలు రంగు ఒక్క నార్మల్‌ డేతో బయట పడిపోయింది.

నైజాంలో కోట్లకి కోట్లు షేర్లు వేసుకుంటూ పోగా, మంగళవారం అసలు షేర్‌ బయట పడింది. ఆ రోజు ముప్పయ్‌ లక్షలకి షేర్‌ పడిపోవడంతోనే డ్రాప్‌ ఏ స్థాయిలో వుందనేది తెలిసిపోయింది. హిందీ వెర్షన్‌ స్టడీగానే వున్నప్పటికీ తెలుగు వెర్షన్‌కి మాత్రం తెలుగు రాష్ట్రాలలోనే ఇంకా అరవై కోట్ల వరకు రికవరీ జరగాల్సి వుంది. ఇకపై ఎంత ఆడినా కానీ ఇందులో నాలుగో వంతు వసూలవడం కష్టమని ట్రేడ్‌ అంటోంది. అలాగే ఓవర్సీస్‌లో కూడా డిజాస్టర్‌ దిశగా సాహో పయనిస్తోంది. సెకండ్‌ వీకెండ్‌లో కాస్త రైజ్‌ కనిపించే అవకాశమున్నా కానీ వీక్‌ డేస్‌లో డ్రాప్‌ని బట్టి సెకండ్‌ వీక్‌ రన్‌ ఇంకా జఠిలం అవుతుందనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English