మ‌హేష్.. క‌ష్టం త‌క్కువ‌.. ఆదాయం ఎక్కువ‌..

మ‌హేష్.. క‌ష్టం త‌క్కువ‌.. ఆదాయం ఎక్కువ‌..

సుకుమార్ సినిమాను మ‌హేష్ బాబు వ‌ద్ద‌నుకున్నాడా.. మ‌హేష్‌బాబును కాద‌ని బ‌న్నీతో సుక్కు ఆ సినిమా చేయాల‌నుకున్నాడా అనే విష‌యంలో ఇప్ప‌టికీ జ‌నాల‌కు సందిగ్ధ‌త ఉంది. మ్యూచువ‌ల్ అండ‌ర్ స్టాండింగ్‌తోనే సినిమా క్యాన్సిల్ అయింద‌ని అంటారు కానీ.. ఈ చిత్రాన్ని మ‌హేషే వ‌ద్ద‌నుకున్నాడన్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

సుకుమార్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డి బాడీ స‌హా ఓవ‌రాల్ లుక్ మార్చుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది మ‌హేష్‌కు. గ‌డ్డం పెంచి ఏడెనిమిది నెల‌ల పాటు లుక్ మెయింటైన్ చేయాలి. మామూలు సినిమాల‌తో పోలిస్తే ఎక్కువ డేట్లు కూడా ఇవ్వాలి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో అత‌డికి అనిల్ రావిపూడి, అనిల్ సుంక‌ర‌ ఆక‌ర్ష‌ణీయ‌మైన డీల్‌తో వ‌చ్చి బుట్ట‌లో వేశార‌ని.. అత‌డి మ‌న‌సు మార్చేశార‌ని అంటారు. అది ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా. లుక్ విష‌యంలో క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని లేదు. ఎక్కువ డేట్లు కూడా అవ‌స‌రం లేదు. పైగా భారీగా ఆదాయ‌మూ స‌మకూరే అవ‌కాశం ఉంది. స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రోమోలు.. షూటింగ్ అప్ డేట్స్ చూస్తే మ‌హేష్ ఎంత ఈజీగా సినిమా చేసుకుపోతున్నాడో అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ అయిపోయింది. మ‌హేష్ లుక్ కోసం క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేక‌పోయింది. ఇక ఆదాయం సంగ‌తి చూస్తే ఔరా అన‌కుండా ఉండ‌లేరు. మ‌హేష్‌కు 50 కోట్ల‌కు పైగానే వ‌ర్క‌వుట్ అవుతోంద‌ట‌. ఈ సినిమాకు పారితోష‌కం బ‌దులు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ఆదాయాన్ని తీసుకుంటున్నాడు మ‌హేష్‌. శాటిలైట్, డిజిట‌ల్, డ‌బ్బింగ్ హ‌క్కుల‌న్నీ క‌లిపి రూ.52 కోట్ల దాకా ఆదాయం స‌మ‌కూరుతోంద‌ట‌.

మ‌రి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండా ఇంత ఈజీగా ఈ స్థాయిలో ఆదాయం వ‌స్తుంటే.. సుక్కు సినిమా కోసం అంత క‌ష్ట‌ప‌డాల‌ని మ‌హేష్ ఎందుకు అనుకుంటాడు? మ‌హేష్ రొటీన్ లుక్, క‌థ‌ల‌తో బోర్ కొట్టించేస్తున్నాడ‌ని ప్రేక్ష‌కులు అంటే అనుకోనీ.. మ‌హేష్‌కు ఏంటి న‌ష్టం?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English