జెర్సీ భామకు పిల్లలు వద్దట

జెర్సీ భామకు పిల్లలు వద్దట

ఎంట్రీ మూవీ ఎప్పుడూ గ్లామర్ పొంగిపోర్లేలా ఉండటమే కాదు.. ఆ సినిమాతో మరో మూడు.. నాలుగు అవకాశాలు దక్కించుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చే నటీమణుల్ని చూస్తాం. ఈ లెక్కన చూస్తే..కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్‌ కాస్త డిఫరెంట్. తెలుగులో తన తొలి మూవీ జెర్సీలో ఆమె గ్లామర్ పాత్రతో పాటు.. స్కూల్ కి వెళ్లే పిల్లాడి తల్లిగా నటించి మార్కులు కొట్టేసింది.

ఒకే సినిమాలో గ్లామర్ తో పాటు నటనకు అస్కారం ఉన్న పాత్రను పోషించినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది. తాజాగా తెలుగులో జోడీతో పాటు.. తమిళం.. కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. తనకు పిల్లల్ని కనే ఆలోచన లేదని చెప్పింది.
ఎందుకన్న విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ.. తన తాతయ్య..బామ్మలు  15 మంది పిల్లల్ని కన్నారని.. తన తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలేనని..తాను మాత్రం పిల్లల్ని కనే ఆలోచనే లేదన్నారు.

ఇక.. మహిళలపై అత్యాచారం ఒక్కటే నేరం కాదని.. మహిళల్ని తప్పుడు దృష్టితో చూస్తూ మాట్లాడటం కూడా నేరమేనన్నారు. కాలం మారుతున్నప్పటికీ నేటికీ మహిళల్ని ఆటబొమ్మలుగా చూస్తున్నారన్నది పచ్చి నిజమంది. పిల్లల్ని కననంటూ తీర్మానం చేయటం లేదని.. చదువు.. తనకున్న తెలివితేటలతో తాను తీసుకున్న నిర్ణయంగా పేర్కొంది. కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వేళ పెళ్లి లాంటిదేమీ లేకుండా పిల్లల్ని కనననే స్టేట్ మెంట్ మర్మమేంది శ్రద్ధా శ్రీనాధ్?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English